Telugu News » Photo gallery » Experts give some tips to keep mosquitoes away with household items
దోమల బెడదతో విసిగిపోయారా.. ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..
Ganesh Mudavath |
Updated on: Feb 07, 2023 | 7:37 PM
దోమలు కంటికి కనిపించే శత్రువులు. మన చుట్టూ తిరిగుతూ మన మీదే పగబడతాయి. ఆస్పత్రి పాలు చేస్తాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు వంటి తదితరమైన వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా దోమల వల్ల పిల్లలు, వృద్ధులకు చాలా ప్రమాదం. ప్రమాదకరమైన దోమల నివారణపై తప్పక దృష్టి సారించాలి... ..
Feb 07, 2023 | 7:37 PM
కర్పూరం కలిపిన నూనె, మట్టి ప్రమిదలో వేసి దీపం వెలిగించడం వల్ల ఎక్కువ పొగవస్తుంటుంది. పొగకు దోమలు పరారవుతాయి. పడుకోవడానికి గంట ముందే దీపం పెట్టి తలుపులు మూసేయాలి. ఈవిధంగా చేసినట్టయితే దోమలు కనిపించవు. అదేవిధంగా వెల్లుల్లి రెమ్మలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు కొబ్బరి నూనె వేసి బాగా మరగపెట్టాలి.
1 / 5
సాయంత్రం, మధ్యాహ్నం వేళల్లో దోమలు ఎక్కువగా కుడతాయి కాబట్టి ఈ సమయంలో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. ఇంట్లో ఎక్కడ నీటిని నిల్వ ఉంచకూడదు. వీటి వల్ల దోమల ఎక్కవగా వృద్ది చెందుతాయి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, వివిధ నివారణ చర్యల ద్వారా దోమల వ్యాప్తిని తగ్గించవచ్చు.
2 / 5
వెల్లుల్లిలో ఉండే ఔషదగుణాలన్ని కూడా కొబ్బరి నూనెలోకి దిగుతాయి. ఆ తరువాత స్టౌ ఆఫ్ చేసి అది చల్లారిన తరువాత దానిని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. నిద్రపోయే ముందు కాళ్లు చేతులకు రాసుకోవడం వల్ల దోమలు కుట్టకుండా ఉంటాయి.
3 / 5
వేప నూనె చెంచాడు తీసుకొని చెంచాడు కర్పూరం వేసి బాగా కలపాలి. బిర్యాని ఆకులు పైన రాయాలి. తరువాత దోమలున్న గదిలో బిర్యాని ఆకులను కాల్చి పెట్టాలి. ఇవి కాల్చడం వల్ల బాగా పొగ వస్తుంది. కర్పూరం వేప నూనె వాసన దోమలకు అస్సలు పడదు. ఈ పొగకు దోమలు ఎక్కడ దాక్కుని ఉన్న పరారవుతాయి.
4 / 5
వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి 15 నిమిషాలు బాగా మరగబెట్టుకోవాలి. ఈ నీటిని తరువాత వడకట్టి స్ప్రే బాటిల్ లో పోసుకొని ఈ వాటర్ ని దోమలు ఉన్న చోట స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల దోమలు ఉండవు. నిమ్మరసం తీసుకుని ఇంట్లో చల్లితే కూడా దోమలు తగ్గుతాయి.