- Telugu News Sports News Cricket news Pakistan spinner asif afridi ban for two years for match fixing
పాకిస్తాన్ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం.. 2 ఏళ్లపాటు నిషేధం విధించిన పీసీబీ.. ఎవరంటే?
Match Fixing In Pakistan Cricket: మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాక్ ఆటగాళ్లు చిక్కుకోవడం కొత్త విషయమేమీ కాదు. పాకిస్థాన్ చరిత్ర కళంకిత ఆటగాళ్లతో నిండి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Updated on: Feb 07, 2023 | 7:34 PM

మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాక్ ఆటగాళ్లు చిక్కుకోవడం కొత్త విషయమేమీ కాదు. పాకిస్థాన్ చరిత్ర కళంకిత ఆటగాళ్లతో నిండి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మరో పాకిస్థాన్ సీనియర్ ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి రెండేళ్ల నిషేధానికి గురయ్యాడు.

లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ఆసిఫ్ అఫ్రిది ఈ బౌలర్‌పై పీసీబీ రెండేళ్లపాటు నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఈ ఆటగాడు ఇప్పుడు సెప్టెంబర్ 12, 2024 వరకు క్రికెట్‌కు దూరమయ్యాడు.

పీసీబీ ఆసిఫ్ ఆఫ్రిదిని వచ్చే రెండేళ్ల పాటు దేశవాళీ క్రికెట్, పీఎస్ఎల్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించింది. ఆసిఫ్ అఫ్రిది కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు. అక్కడ రావల్‌కోట్ హాక్స్ జట్టు తరపున ఆడుతున్నప్పుడు, ఈ ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు.

పాకిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లలో ఆసిఫ్ అఫ్రిది ఒకరు. ఈ ఆటగాడు 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 118 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏలో 59 వికెట్లు తీశాడు. టీ20ల్లో అఫ్రిది 63 వికెట్లు తీశాడు. బాబర్ ఆజం వికెట్ కూడా ఆసిఫ్ అఫ్రిది పడగొట్టాడు.

పీఎస్‌ఎల్‌లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆసిఫ్ అఫ్రిది ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో, ఆసిఫ్ ఖైబర్ పఖ్తున్ఖ్వా తరపున ఆడాడు.





























