AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు కుర్రాడి టాలెంట్‌కి అమెరికా ఫిదా.. విద్యార్థి గళంలో విజేత సాహిత్‌.. ఏం చేశాడో తెలుసా..?

ఈ ఏడాది వేర్వేరు పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు ఈ లీగ్‌లో పోటీ పడగా.. సాహిత్‌ మంగు గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌ అవార్డు దక్కించుకున్నాడు.

తెలుగు కుర్రాడి టాలెంట్‌కి అమెరికా ఫిదా.. విద్యార్థి గళంలో విజేత సాహిత్‌.. ఏం చేశాడో తెలుసా..?
Telangana Origin Student
Jyothi Gadda
|

Updated on: Feb 08, 2023 | 5:16 PM

Share

పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న నానుడి నిజం చేశాడు తెలంగాణకు చెందిన 12ఏళ్ల కుర్రాడు. అగ్రరాజ్యం అమెరికా వేదికగా తన సత్తా చాటుకున్నాడు. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. అన్నట్టుగా తన గళంతో టాప్‌ స్పీకర్‌గా నిలిచాడు.. ప్రతిష్టాత్మక గోల్డన్ గావెల్ అవార్డు గెలుచుకున్నాడు. అతడు ఎవరో కాదు మన హైదరాబాద్‌ వాస్తవ్యుడే.. హైదరాబాద్‌ నుంచి వలస వెళ్లి అమెరికా న్యూజెర్సీలో స్థిరపడిన ఓ కుటుంబం నుంచి వచ్చిన సాహిత్‌ మంగు తన ప్రసంగాలతో అదరగొట్టాడు. ప్రతిష్టాత్మక గార్డెన్‌ స్టేట్‌ డిబేట్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు.

భారత్‌ నుంచి వచ్చిన హైదరాబాదీ కుటుంబం సాహిత్‌ మంగుది. న్యూజెర్సీ సోమర్‌సెట్‌లోని సెడార్‌ హిల్‌ ప్రిపరేటరీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. న్యూజెర్సీ రాష్ట్రంలో ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా డిబెట్‌ లీగ్‌ టోర్నమెంట్లు జరుగుతాయి. ఈ ఏడాది వేర్వేరు పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు ఈ లీగ్‌లో పోటీ పడగా.. సాహిత్‌ మంగు గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌ అవార్డు దక్కించుకున్నాడు.

సాహిత్‌ చేసిన పరిశోధన, లోతైన విషయ అవగాహనకు తోడు ధాటిగా చేసిన ప్రసంగం న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. సాహిత్‌ను విజేతగా ప్రకటించిన జడ్జిలు… అతడు ఎంచుకున్న అంశాలను, వాటికి మద్ధతుగా సేకరించిన విషయాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. న్యూజెర్సీలోని వివిధ పాఠశాలల నుండి మొత్తం 164 మంది విద్యార్థులు నాలుగు అంశాలను కవర్ చేస్తూ గార్డెన్ స్టేట్ లీగ్‌లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

– సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించాలి. –  అమెరికాలో అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావాలి. –  ఫేసియల్‌ టెక్నాలజీ వల్ల చెడు కంటే మంచే ఎక్కువ. –  శాఖాహారమే మంచిది, మాంసాహారం సరైంది కాదు. ఈ నాలుగు అంశాలపై సాహిత్‌ తన ప్రసంగంతో అదరగొట్టేశాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..