Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ఈ కారు డ్రైవర్ ట్యాలెంట్ మామూలుగా లేదు.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..

స్టంట్స్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. కాస్త అటు ఇటు అయినా.. ప్రాణాలు రిస్క్ లో పెట్టాల్సిందే. కాబట్టి చాలా మంది స్టంట్స్ చేసేందుకు వెనకడుగు వేస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం స్టంట్స్ ను చాలా..

Trending Video: ఈ కారు డ్రైవర్ ట్యాలెంట్ మామూలుగా లేదు.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..
Car Stunt Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 08, 2023 | 5:36 PM

స్టంట్స్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. కాస్త అటు ఇటు అయినా.. ప్రాణాలు రిస్క్ లో పెట్టాల్సిందే. కాబట్టి చాలా మంది స్టంట్స్ చేసేందుకు వెనకడుగు వేస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం స్టంట్స్ ను చాలా ఈజీగా చేసేస్తారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయినప్పటి నుంచి తమలోని ట్యాలెంట్ ను చక్కగా బయటపెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. ఇలా తమలో దాగి ఉన్న నైపుణ్యాలను వీడియో రూపంలో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్షణాల్లో వైరల్ గా మారుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. నిటారుగా ఉన్న వాలు దిగువన రెండు కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అదే సమయంలో పైనున్న జనం పెద్ద ఎత్తున కిందకు చూస్తున్నారు. ఆ తర్వాత ఓ వ్యక్తి.. తెల్లరంగు కారును నిటారుగా వాలుపైకి నడపడం స్టార్ట్ చేస్తాడు. అయితే.. ఆ కారు ఎక్కడ కింద పడిపోతుందోననే అనుమానం చూసే వారికి కలుగుతుంది. అయినా ఆ డ్రైవర్ మాత్రం ఎంతో చాకచక్యంగా.. కారును బయటకు తీసుకువస్తాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Wang Dingman (@wangdingman)

ఈ అద్భుతమైన కార్ స్టంట్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు వీడియోకు దాదాపు 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలల్లో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. డ్రైవర్ లో దాగి ఉన్న అద్భుత ట్యాలెంట్ ను ప్రశంసిస్తున్నారు.