Turkey Earthquake : టర్కీ, సిరియా భూకంప విలయం.. 10వేలకు చేరువలో మరణాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన..

ఈ ఘోర విపత్తులో 20 వేల మందికిపైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. భూకంపం కారణంగా సిరియాలో ఓ జైలు ధ్వంసమైంది. ఇదే అదనుగా కొందరు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు.. అధికారులపై తిరుగుబాటు చేసి పారిపోయారని తెలిసింది. 

Turkey Earthquake : టర్కీ, సిరియా భూకంప విలయం.. 10వేలకు చేరువలో మరణాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన..
Turkey, Syria Earthquake
Follow us

|

Updated on: Feb 08, 2023 | 4:58 PM

వరుస భూకంపాలు టర్కీ- సిరియాను వణికిస్తున్నాయి. బుధవారం మరోసారి అక్కడ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. గాజియాంటెప్‌ ప్రావిన్స్‌ లోని నూర్దగి జిల్లాలో బుధవారం ఉదయం 8:31గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు తెలిపింది. మరోవైపు టర్కీ- సిరియాలో సంభవించిన వినాశకరమైన భూకంపం ధాటికి రణించిన వారి సంఖ్య దాదాపు 10,000లకు చేరింది. ప్రాణాలతో బయటపడిన వారిని, గాయపడిన వారికి సహాయం చేయడానికి ముమ్మర రెస్క్యూ కొనసాగుతోంది. భారతదేశంతో సహా అనేక దేశాల నుండి అంతర్జాతీయ సహాయం ఉన్నప్పటికీ, గడ్డకట్టే చలి వాతావరణం ఒకవైపు, సహాయక చర్యలకు ఆటంకం కలిగించే అనేక అనంతర ఇబ్బందుల నడుమ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టర్కీ అధ్యక్షుడు భూకంప ప్రభావిత ప్రాంతానికి చేరుకుని.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

టర్కీ, సిరియా దేశాలపై గత మూడు రోజులుగా పంజా విసురుతున్న భూకంపం.. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 9,500కి చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. రెండు దేశాల్లో కలిపి 30 వేల మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. భారీ భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద లక్షల మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర విపత్తులో 20 వేల మందికిపైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది.

ఎటు చూసిన శిథిల భవనాల కింద శవాల గుట్టలే దర్శనమిస్తున్నాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలు మారుమోగుతున్నాయి. వారికి సహాయం చేసే క్రమంలో మరో భూకంపం సంభవించడంతో.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది.. దశాబ్ద కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద విపత్తు అని ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ పేర్కొన్నాడు. వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ యూనిట్‌లను నియామించారని తెలిపారు. టర్కీలో భారీ భూకంపాలు అంకారా బడ్జెట్‌కు బిలియన్ల డాలర్ల నష్టాన్ని మిగిల్చాయంటున్నారు నిపుణులు. ఈ సంవత్సరం ఆర్థిక వృద్ధిని రెండు శాతం పాయింట్లు తగ్గించవచ్చని అధికారులు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, భూకంపం కారణంగా సిరియాలో ఓ జైలు ధ్వంసమైంది. ఇదే అదనుగా కొందరు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు.. అధికారులపై తిరుగుబాటు చేసి పారిపోయారని తెలిసింది.

ఇవి కూడా చదవండి

టర్కీకి అన్ని విధాలా సాయం చేస్తామని భారత్ హామీ ఇచ్చింది. సాయం కోసం ఇప్పటికే ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని, ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌ను టర్కీకి తరలించింది భారత్‌.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..