PM Modi: పార్లమెంటులో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రధాని మోదీ జాకెట్.. ఇది ఎలా తయారు చేశారంటే..
రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసిన లేత నీలం రంగు 'సద్రి' జాకెట్ ధరించి ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు వచ్చారు.

ఆయన ఆహార్యం స్పెషల్. ఆయన వేష ధారణ వెరీవెరీ స్పెషల్. మొత్తంగా ఓ ట్రెండ్ సెట్టర్. ఆయనే PM మోదీ. ప్రధానిగా ఎన్నో టూర్లు చేసుంటారు. మరెన్నో దేశాలు తిరిగి ఉంటారు. ఇవాళ జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆయన ధరించిన జాకెట్ సంథింగ్ డిఫరెంట్. అండ్ సంథింగ్ ఎమోషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ స్టైల్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. మరీ ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సందర్భంగా..ప్రధాని డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆయన పార్లమెంట్‌కు వచ్చినా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన వేసుకునే డ్రెస్‌పై మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈసారి కూడా అదే ఫాలో అయ్యారు ప్రధాని.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ.. చాలా ప్రత్యేకంగా కనిపించారు. ప్రధాని మోదీ ఇవాళ వేసుకన్న జాకెట్‌ను కర్నాటకలో తయారు చేసింది. రెండు రోజుల క్రితం బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌లో బహుమతిగా ఇచ్చిన రీసైకిల్ ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసిన ‘సద్రీ’ జాకెట్. ఈ జాకెట్ ధరించి ఈరోజు ప్రధాని మోదీ పార్లమెంటుకు వచ్చారు.




లేత నీలం రంగు జాకెట్ ధరించి రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో పాల్గొన్నారు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్లాస్టిక్ బాటిళ్లను తిరిగి ఉపయోగించడం ద్వారా అనేక జాకెట్లను తయారు చేసింది. ఫిబ్రవరి 6న ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఈ జాకెట్‌ను ప్రధానికి బహుమతిగా అందించారు. ఇంధన రంగంలో భారత్‌లో చోటుచేసుకుంటున్న విశేషమైన మార్పును ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ ఎనర్జీ వీక్ లక్ష్యం. ఈ వారం సందర్శించే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆర్మీ సిబ్బంది కోసం 10,000 యూనిఫాంలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
Yesterday, in Bengaluru during #IndiaEnergyWeek, Indian Oil Corporation presented @PMOIndia a waistcoat made by using single use plastic bottles.
PM @narendramodi participated in today’s Rajya Sabha discussions wearing this blue coloured waistcoat. #LiFE pic.twitter.com/uyC0Fmxv8F
— Nirmala Sitharaman (@nsitharaman) February 8, 2023
3 లక్షల మంది సిబ్బందికి యూనిఫారాలు:
ఫ్రంట్‌లైన్ కార్మికులకు యూనిఫారాలు తయారు చేసేందుకు 20 మిలియన్ల పాత పీఈటీ బాటిళ్లను రీసైకిల్ చేయాలని ఓ ఆయిల్ కంపెనీ నిర్ణయించింది. గత నవంబర్‌లో ‘అన్‌బాటిల్‌డ్ – టూవర్డ్స్ ఏ గ్రీన్ ఫ్యూచర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు 3 లక్షల మంది పెట్రోల్, డీజిల్ పంప్ అటెండెంట్‌లు, ఇండియన్ ఎల్‌పిజి గ్యాస్ డెలివరీ సిబ్బందికి విడిగా యూనిఫాంలను రూపొందించాలని ఇండియన్ ఆయిల్ నిర్ణయించినట్లు సమాచారం.
405 టన్నుల సీసాల రీసైక్లింగ్ బాటిల్స్‌తో..:
ఉపయోగించిన, పాత PET బాటిళ్ల ప్రాసెసింగ్ నుంచి పొందిన రీసైకిల్ పాలిస్టర్ నుంచి తీసిన వస్త్రంతో తయారు చేశారు. ఇది దాదాపు 405 టన్నుల బాటిళ్లను రీసైకిల్ చేస్తుంది. అంతే కాదు, ఇది ఏటా 20 మిలియన్ బాటిళ్లను కవర్ చేయడంతో సమానం. ఈ విషయంలో ఇండియన్ ఆయిల్ అధికారులు మాట్లాడుతూ.. ప్రధాని ఈ జాకెట్ ధరించడం చాలా ముఖ్యమని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం