Watch : మెట్రో రైలులో రిబ్బన్‌ కటింగ్ వేడుక??… వైరలవుతున్న వీడియో.. నెటిజన్ల రియాక్షన్స్‌ చూడాలి ????

మెట్రో రైలులోకి కత్తెర తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం సరదా అంటూ మరి కొందరు మండిపడుతున్నారు.

Watch : మెట్రో రైలులో రిబ్బన్‌ కటింగ్ వేడుక??... వైరలవుతున్న వీడియో.. నెటిజన్ల రియాక్షన్స్‌ చూడాలి ????
Ribbon Cutting Ceremony
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 08, 2023 | 9:52 PM

మెట్రోలో రిబ్బన్ కటింగ్ ఈవెంట్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కొందరు యువకులు సరదాగా మెట్రో రైలులో రిబ్బన్‌ కటింగ్‌ వేడుక నిర్వహించారు. ఈ  విచిత్ర ఘటన ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకుంది.  మెట్రో రైలులో ప్రయాణించేందుకు కొందరు యువకులు ముందుగా ప్రవేశ ద్వారం వద్ద ఒక రిబ్బన్‌ కట్టారు. ఇంతలో ఒక స్టేషన్‌లో మెట్రో రైలు ఆగింది. కొందరు ప్రయాణికులు అందులోకి ఎక్కారు. అయితే ప్రవేశం వద్ద అడ్డుగా రిబ్బన్‌ ఉండటం చూసి కొందరు కన్‌ఫ్యూజ్‌ అయ్యారు. రిబ్బన్‌ కింద నుంచి వెళ్లేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు.

కాగా, ఇంతలో ఆ రిబ్బన్‌ కట్టిన వారికి చెందిన యువకుడు ఒక కత్తెర తీసుకుని అక్కడకు వెళ్లాడు. ఒక ప్రయాణికుడికి దానిని ఇచ్చి రిబ్బన్‌ కట్‌ చేయమని చెప్పాడు. కొంత కన్‌ఫ్యూజ్‌ అయిన ఆ వ్యక్తి చివరకు కత్తెరతో రిబ్బన్‌ను కట్ చేశాడు. దీంతో మిగతా ప్రయాణికులంతా ఆ మెట్రో రైలులోకి ప్రవేశించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. కొందరు లాఫింగ్‌ ఇమోజీలతో హర్షం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు మాత్రం ఆ యువకుల చర్యపై మండిపడ్డారు. మెట్రో రైలులోకి కత్తెర తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం సరదా అంటూ మరి కొందరు మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..