Video: 2 ఏళ్ల తర్వాత పోస్ట్ చేసిన ధోని.. కొత్త వెహికిల్‌తో అదిరిపోయే వీడియో.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్.. అదేంటో తెలుసా?
యాదృచ్ఛికంగా, ధోని చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ జనవరి 8, 2021న పోస్ట్ చేశాడు. అంటే రెండు సంవత్సరాల ఒక నెల క్రితం, అది కూడా అతని పొలం నుంచి పోస్ట్ చేయడం విశేషం.
ప్రస్తుతం అందరి దృష్టి భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌పైనే ఉంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్ ఎలా ఉందనే విషయంపై ఇరుజట్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈక్రమంలో రెండు జట్లు ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతాయనే ఆసక్తి అందిరిలోనూ నెలకొంది. ఇవన్నీ పక్కన పెడితే.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. వ్యవసాయంలో బిజీగా ఉన్నాడు. బైక్‌లు, కార్లు వదిలేసి ఏకంగా ట్రాక్టర్ నడుపుతూ కనిపించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత ధోనీని భారత అభిమానులు చాలా అరుదుగా చూస్తున్నారు. ఐపీఎల్ లేదా ఏదైనా ఈవెంట్‌లో లేదా ఏదైనా భారతీయ క్రికెటర్ సోషల్ మీడియా పోస్ట్‌లో మాత్రమే కనిపిస్తుంది. అతను తన సోషల్ మీడియా ఖాతాలకు పూర్తిగా దూరంగా ఉండడంతోనే ఇలా జరగుతోంది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చిన ఆయన ఓ అద్భుతమైన వీడియోతో అభిమానులను సంతోషపెట్టారు.
పొలంలో ట్రాక్టర్ డ్రైవింగ్‌లో బిజీ..
View this post on Instagram
భారత మాజీ కెప్టెన్ ధోని ఫిబ్రవరి 8 బుధవారం సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతను ట్రాక్టర్‌పై కూర్చుని తన ఫామ్ హౌస్ పొలాల్లో దుక్కి దున్నుతున్నాడు. ధోనీ వీడియోలో.. ‘కొత్తది నేర్చుకోవడం ఆనందంగా ఉంది. కానీ, ఈ పనిని పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది’ అంటూ రాసుకొచ్చారు.
2 ఏళ్ల తర్వాత మొదటి పోస్ట్..
దాదాపు గంట వ్యవధిలో ఈ వీడియోకు 16 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అదే సమయంలో దీనిపై వందలాది కామెంట్లు కూడా వచ్చాయి. చాలా కాలం తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో తమ స్టార్ అప్‌డేట్స్ ఇవ్వడంతో ధోనీ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. యాదృచ్ఛికంగా, ధోని చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ జనవరి 8, 2021న పోస్ట్ చేశాడు. అంటే రెండు సంవత్సరాల ఒక నెల క్రితం, అది కూడా అతని పొలం నుంచి పోస్ట్ చేయడం విశేషం. ఇప్పుడు ధోని మళ్లీ రెండేళ్లపాటు అదృశ్యమవుతాడా లేదా క్రమం తప్పకుండా ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాడనేది చూడాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..