Ind vs Aus: భారత్-ఆసిస్ మధ్య టెస్ట్ సిరీస్.. నాగపూర్‌లో తొలి టెస్ట్.. 9.30 గంటకు ప్రారంభం..
భారత్-ఆసీస్ మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌సిరీస్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ నాగపూర్‌లో ఉదయం 9.30కి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్స్ ఫైనల్ బెర్త్ రేసులో నిలవాలంటే..
భారత్-ఆసీస్ మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌సిరీస్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ నాగపూర్‌లో ఉదయం 9.30కి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్స్ ఫైనల్ బెర్త్ రేసులో నిలవాలంటే.. ఈ సిరీస్‌ని మినిమమ్ 2-0తో గెలవాల్సిందే. అయితే పంత్ గాయపడడం, అయ్యర్ దూరమవడం, బుమ్రా ఇంకా కోలుకోకపోవడంతో టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అన్నదే ఆసక్తికరంగా మారింది. పంత్ ప్లేస్‌లో ఇద్దరు పోటీలో ఉన్నారు. రిజర్వ్ కీపర్‌గా ఉన్న భరత్, కొత్తగా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్. వీరిలో కిషన్‌వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది.
పంత్ మాదిరే.. యంగ్ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో ఫైనల్ బెర్త్ దక్కొచ్చు. ఇక ఓపెనింగ్ కాంబినేషన్ రోహిత్, రాహుల్ కంటిన్యూ కాబోతున్నారు. తొలి డౌన్‌లో పుజారా, తర్వాత కోహ్లీ టాప్4లో ఆడతారు. కాని ఐదో స్థానంలో రావాల్సిన అయ్యర్ ప్లేస్‌లో గిల్, సూర్యకుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. గిల్ ఫామ్‌ని పరిగణలోకి తీసుకుంటే.. అతడే బరిలో దిగే అవకాశాలున్నాయి. సూర్య బెంచ్‌కే పరిమితం అవుతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో జడేజా ఉన్నాడు. దేశవాళిలో రీఎంట్రీ మ్యాచ్ ఆడిన జడేజా బంతితో అదరగొట్టాడు. తర్వాతిప్లేస్‌లో అశ్విన్ ఉండనే ఉన్నాడు. అయితే నాగపూర్ పిచ్ స్పిన్‌కి అనుకూలించే అవకాశాలుండడంతో మూడో స్పిన్నర్‌కి చాన్స్ ఉంది. అక్షర్ పటేల్‌ని దించుతారా? కుల్‌దీప్‌కు అవకాశమిస్తారా అనేది చివరి క్షణం వరకు సస్పెన్సే. పేసర్లుగా సిరాజ్, షమీ బరిలోదిగుతారు. సిరాజ్ మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం.
ఇక ఆస్ట్రేలియా సొంతగడ్డపై భారత్‌ను ఓడించాలన్న కలతో మరోసారి బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్‌లో గతేడాది సిరీస్ నెగ్గి ఉపఖండంలో సత్తా చాటిన ఆసీస్.. ఈసారి భారత్‌ను ఓడిస్తామన్న ధీమాతో ఉంది. వార్నర్, లబూషేన్, స్టీవ్‌స్మిత్ ఫామ్‌లో ఉండడం ఆందోళనకలిగించే అంశం. ఖవాజా కూడా డేంజరస్ బ్యాట్స్‌మనే. ట్రావిస్‌హెడ్, రెన్‌షాతో మిడిలార్డర్ బలంగా ఉంది. నాథన్ లయన్, అష్టోన్ అగర్ స్పిన్ ద్వయంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. హేజిల్‌వుడ్ గాయం వల్ల పాట్‌కమిన్స్‌కి తోడు.. స్టార్క్ బరిలో దిగే చాన్స్ ఉంది. మూడో స్పిన్నర్‌గా స్టీవ్‌స్మిత్ ఓ చేయి వేయొచ్చు.
ఇక నాగ్‌పూర్ పిచ్‌పై ఆస్ట్రేలియా దుమారం లేపింది. పిచ్‌ను స్పిన్నర్లకు అనుకూలంగా తయారుచేశారంటూ మండిపడుతున్నారు ఆసీస్ మాజీలు. అయితే ఆస్ట్రేలియాలో మీకు అనుకూలంగా పిచ్‌లు తయారుచేసుకుంటారు.. ఇక్కడికొచ్చి ఏడుస్తారంటూ మన మాజీలు కౌంటర్స్ ఇస్తున్నారు. ఇక భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఈ సిరీస్‌ని 2-0తోగాని, 3-1తోగాని, 3-0, 4-0 ఇలా నాలుగు సినారియోలలో గెలిస్తే సరిపోతుంది. మరి మనోళ్లు ఏం చేస్తారో.. ఈరోజు నుంచి మొదలయ్యే సిరీస్‌లో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..