Vizianagaram: గుండెల్ని మెలిపెట్టే ఘటన.. డబ్బుల్లేక భార్య శవాన్ని మోసుకుంటూ కిలోమీటర్లు..
విజయనగరం జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. డబ్బులు లేకపోవడంతో భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని... కిలోమీటర్ల మేర నడిచాడు భర్త.
గుండెలు తరుక్కుపోయే ఘటన ఇది. మనసున్న ప్రతి మనిషిని కదిలించే సంఘటన. విజయనగరం జిల్లాలో హృదయవిదారక ఘటన మిమ్మల్ని కన్నీరు పెట్టిస్తుంది. అతనో పేద వ్యక్తి. ఒడిస్సాకు చెందినవాడు. భార్య అనారోగ్యం పాలవ్వడంతో సరిహద్దు జిల్లాలో విజయనగరంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేర్చించాడు. కానీ ఆమె బ్రతకడం కష్టమని.. చికిత్సకు శరీరం సహకరించటం లేదని.. ఇంటికి తీసుకెళ్లమన్నారు వైద్యులు. దీంతో ఆటోలో భార్యతో కలిసి తిరిగి ఒరిస్సాకు పయనమయ్యాడు. మార్గమధ్యలోనే భార్య మృతి చెందింది. దీంతో చెల్లూరు రింగ్ రోడ్డులో డెడ్ బాడీని దించి వెళ్లిపోయాడు ఆటో డ్రైవర్. డబ్బులు లేకపోవడంతో భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కిలోమీటర్ల మేర నడిచాడు భర్త. స్థానికులు సమాచారం ఇవ్వడంతో.. అక్కడికి చేరుకుని సహయకచర్యలు చేపట్టారు విజయనగరం రూరల్ పోలీసులు. అతడి తీవ్రమైన ఆకలితో ఉండటంతో ముందు అన్నం పెట్టారు. ఆపై దగ్గరుండి డెడ్ బాడీని అంబులెన్స్ సహాయంతో సొంత గ్రామం చేర్చేలా ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..