APSRTC: ఆర్టీసీ కొత్త సర్వీస్.. హిందూపురం – హైదరాబాద్ ఇంద్ర ఏసీ.. టైమింగ్స్ ఇవే..

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Feb 08, 2023 | 8:32 PM

ప్రయాణీకులకు అట్రాక్ట్ చేసేందుకు ఆఫర్స్ ఇవ్వడమే కాదు.. కొత్త సర్వీసులు ప్రవేశపెడుతూ ఇబ్బందులు లేకుండా జర్నీ సౌకర్యం అందిస్తుంది ఏపీఎస్ ఆర్టీసీ.

APSRTC: ఆర్టీసీ కొత్త సర్వీస్.. హిందూపురం - హైదరాబాద్ ఇంద్ర ఏసీ.. టైమింగ్స్ ఇవే..
Apsrtc Indra AC

ప్రయాణీకుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ పలు కొత్త సర్వీసులను ప్రవేశపెడుతుంది. సౌకర్యవంతంగా, సురక్షితంగా పాసింజర్స్‌ను గమ్యస్థానాలకు చేరుస్తుంది. తాజాగా హిందూపురం నుంచి హైదరాబాద్ (BHEL)కు ఇంద్ర ఏసీ (2+2) (పుష్ బ్యాక్) సర్వీసును ప్రవేశపెట్టింది. సులభతర ప్రయాణం కోసం సరసమైన ధరతో ఉన్న ఇంద్ర ఏసీ బస్సులను ఆదరించాలని ఆర్టీసీ సూచించింది. ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరింది. ప్రయాణీకులు సౌకర్యార్థం ఈ బస్సులో శుభ్రమైన దుప్పటి, మినరల్ వాటర్ బాటిల్, ఫేషియల్ కిట్, సెల్ ఫోన్ ఛార్జింగ్, టీవీ సౌకర్యాలు ఎటువంటి అదనపు డబ్బు లేకుండానే అందజేస్తున్నట్లు తెలిపింది.

ఈ బస్సు ప్రతి రోజు రాత్రి 09.00 గంటలకు హిందూపురం నందు బయలుదేరి పెనుకొండ , అనంతపూర్‌,  కర్నూల్‌ మీదుగా హైదరాబాద్‌ కు ఉదయం 06.00 గంటలకు, BHEL 7 గంటల 10 నిమిషాలకు చేరుకుంటుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో బీహెచ్‌ఈఎల్ నుంచి రాత్రి 09.00 గంటలకు బయలు దేరి… హైదరాబాద్‌ నందు రాత్రి 10.45 గంటలకు బయలుదేరి కర్నూల్‌, అనంతపూర్‌, పెనుకొండ మీదుగా ఉదయం 07.10 గంటలకు హిందూపురం చేరకుంటుందని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ముందస్తూ రిజర్వేషన్‌ ,ఆన్‌ లైన్‌ బుకింగ్‌ కొరకు ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని కోరింది.  ప్రయాణీకుల భద్రత తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu