AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chocolate Day: కలిసి నడిచే దారిలో ఎన్నో అటు పోట్లు.. ప్రేమగా మొదలుపెట్టిన ప్రతి అడుగు మధురంగానే మారుస్తా..

అప్పుడే రోజ్ డే, ప్రపోజ్ డే అయిపోయింది... ఇక నెక్ట్స్ ఏంటో తెలుసా.. రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేసిన తర్వాత తియ్యని వేడుక చేసుకోవాలి కదా.. హా.. అందుకే ప్రపోజ్ డే తర్వాత నేనున్నానంటూ వచ్చేస్తోంది..

Chocolate Day: కలిసి నడిచే దారిలో ఎన్నో అటు పోట్లు.. ప్రేమగా మొదలుపెట్టిన ప్రతి అడుగు మధురంగానే మారుస్తా..
Chocolate Day
Ganesh Mudavath
|

Updated on: Feb 08, 2023 | 10:02 PM

Share

అప్పుడే రోజ్ డే, ప్రపోజ్ డే అయిపోయింది… ఇక నెక్ట్స్ ఏంటో తెలుసా.. రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేసిన తర్వాత తియ్యని వేడుక చేసుకోవాలి కదా.. హా.. అందుకే ప్రపోజ్ డే తర్వాత నేనున్నానంటూ వచ్చేస్తోంది చాకొలెట్ డే. రోజ్ ఇచ్చి మనసులోని భావాలను మాటల రూపంలో చెప్పిన తర్వాత.. నోరు తీపి చేసుకోవాలి కదా.. సో.. ప్రేమికలు ఒకరినొకరు చాక్లెట్స్ ఇచ్చిపుచ్చుకునే ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ వాలెంటైన్స్ వీక్ లో చాక్లెట్ డే ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా.. ఏదైనా ప్రత్యేక సందర్భాన్ని స్మరించుకోవడానికి స్వీట్లు సరైన మార్గం. భారతీయ సంస్కృతిలో సంప్రదాయ మిఠాయిలకు అగ్రతాంబూలం వేస్తుంటారు. పండుగలకు రకరకాల స్వీట్లు తయారు చేసుకుంటారు. అయితే.. చాక్లెట్లు రుచికి తియ్యగా ఉన్నా.. వాటిని స్వీట్లుగా పరిగణలోకి తీసుకోరు. కానీ ప్రేమికులకు అలా కాదు. ఇష్టమైన వారు చాక్లెట్ ఇస్తే.. ఇంప్రెస్ కాని వారు ఎవరూ ఉండరేమో. కాబట్టి చాక్లెట్ ను మించిన గిఫ్ట్ లేదనే చెప్పవచ్చు.

ఏటా.. ఫిబ్రవరి 9 న చాక్లెట్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. వాలెంటైన్ వీక్ లోని మూడో రోజు ప్రేమ, మాధుర్యాన్ని పంచుతుంది. విక్టోరియన్ కాలం నుంచి చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి ఉంది. ప్రేమలో ఉన్న వ్యక్తులు ఒకరికొకరు ఇచ్చే బహుమతులలో చాక్లెట్లు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. ప్రేమను వ్యక్తపరచడానికి, మనసులోని భావాలను బయటపెట్టడానికి చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఒప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 9 న వాలెంటైన్ వీక్ లో భాగంగా జరుపుకునే చాక్లెట్ల పండుగను ఏటా జూలై 7న కూడా జరుపుకుంటారు. ప్రపంచ చాక్లెట్‌ దినోత్సవం నిర్వహిస్తారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవం జరుపుకొంటున్నారు. జూలై 7న ఐరోపాలో మొదటిసారిగా చాక్లెట్‌ తయారైందని లభించిన ఆధారాల వల్ల తెలుస్తోంది.

డార్క్‌ చాక్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక గుణాలు కలిగి ఉంది. డార్క్‌ చాక్లెట్లు శరీరంలోని రక్త సరఫరాను మెరుగుపరస్తుంది. రక్తపోటు సమస్య నుంచి కాపాడుతుంది. మెదడు నుంచి గుండెకు రక్తాన్ని సాఫీగా సాగేలా చూస్తుంది. యాంటీ ఆక్సి డెంట్లు అధికం. డార్క్‌ చాక్లెట్లలో ముఖ్యంగా ఐరస్, మెగ్నీషియం, కాపర్‌ కలిగి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి.. నోరు తీపి చేసుకునేందుకు చాక్లెట్ డే కంటే మంచి సందర్భం ఏముంటుంది చెప్పండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్  చేయండి..