Viral Video: బతికుండగానే వర్ధంతి చేసుకున్న వ్యక్తి.. పేదలకు దుప్పట్లు పంచి, భోజనం పెట్టించిన వ్యక్తి..
మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఆ వ్యక్తికి తెలియదు. సాధారణంగా మనిషి చనిపోయాకు అతని కుటుంబ సభ్యులు వారికి అంత్యక్రియలు నిర్వహించి, ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తారు.
మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఆ వ్యక్తికి తెలియదు. సాధారణంగా మనిషి చనిపోయాకు అతని కుటుంబ సభ్యులు వారికి అంత్యక్రియలు నిర్వహించి, ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే కారణమేదైనా కొందరు మాత్రం ఇలాంటి వాటిని నిర్వహించరు. అలా తను మరణించాక తన వర్ధంతి చేస్తారో చేయరో అని భావించాడో ఏమో పంజాబ్‌కు చెందిన ఓ వృద్ధుడు బ్రతికుండగానే తన వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాడు. ఇందుకు అతని కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. ఫతేగఢ్ సాహిబ్ జిల్లా మజ్రి సోధియా గ్రామానికి చెందిన భజన్ సింగ్ వృత్తిరీత్యా ఓ మిల్లులో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే శాస్త్రబద్ధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అందరికీ తెలియచేయడమే తన ఉద్దేశమని ఆ భజన్ సింగ్ తెలిపారు. తన వర్ధంతి కార్యక్రమంలో భాగంగా పేదలకు దుప్పట్లు పంచాడు, అనాధలకు భోజనం పెట్టించాడు. ఇలా తాను ఐదేళ్లుగా వర్ధంతి జరుపుకుంటున్నట్టు తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

