Couple fight: మంచం కోసం తన్నుకున్న భార్యభర్తలు.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్.. ట్రేండింగ్ వీడియో.
భార్యభర్తల మధ్య గొడవలు చెలరేగడానికి ప్రత్యేకమైన కారణాలేమీ అక్కర్లేదు. భార్య వంట బాగా చేయలేదనో, భర్త పక్కింటి అమ్మాయిని చూసాడనో గొడవలు తలెత్తుతూనే ఉంటాయి. ఇదిలా కానీ, ముంబైలోని ఓ జంట మధ్య మాత్రం ఒక విచిత్రమైన కారణంతో గొడవ జరిగింది.
భార్యభర్తల మధ్య గొడవలు చెలరేగడానికి ప్రత్యేకమైన కారణాలేమీ అక్కర్లేదు. భార్య వంట బాగా చేయలేదనో, భర్త పక్కింటి అమ్మాయిని చూసాడనో గొడవలు తలెత్తుతూనే ఉంటాయి. ఇదిలా కానీ, ముంబైలోని ఓ జంట మధ్య మాత్రం ఒక విచిత్రమైన కారణంతో గొడవ జరిగింది. చివరకు భర్తను కటకటాలపాలు చేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బొరివిలి ఏరియా రాంబాగ్ లేన్‌కు చెందిన ఓ జంట మధ్య గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దాంతో తనకు విడాకులు కావాలని భార్య కోరింది. అందుకు భర్త ససేమిరా అన్నాడు. దాంతో ఇద్దరికీ క్షణం పడకపోయినా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ చెరిసగం పంచుకొని షిఫ్ట్‌లు వారీగా పనులు చేసుకుంటున్నారు. అన్నీ పంచుకోగలరు కానీ టీవీని, మంచాన్ని పంచుకోలేరు కదండీ… అందుకని వారి బెడ్‌ని కూడా గంటల వారీగా షేర్ చేసుకున్నారు.ఈ క్రమంలో జనవరి 28న భర్త రాత్రి ఒంటిగంట సమయంలో భార్యను నిద్ర లేపాడు. తను రెస్ట్ తీసుకోవాలని, మంచం కావాలని కోరాడు. అందుకు ఆమె ఇది నా టైమ్.. నేను లేవను పొమ్మంది. దాంతో చిర్రెత్తిన భర్త ఆమె చెంప మీద కొట్టాడు. ఈ క్రమంలో ఆమె గూబ గుయ్‌మని.. వినికిడి కోల్పోయింది. వెంటనే ఆమ తన స్నేహితురాలికి ఫోన్ చేసి ఆమె సహాయంతో ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షచేసిన వైద్యులు లోపలి చెవి దెబ్బతిందని చెప్పారు. అంతే ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై కేసుపెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 325 కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి తాము భర్తపై కేసు నమోదు చేశామని, అతడిని కస్టడీలోకి తీసుకున్నామని, కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..