రన్‌వే పై పల్టీలు కొట్టిన శిక్షణ విమానం.. తృటిలో తప్పించుకున్న పైలట్.. ఏం జరిగిందంటే..
ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపి డీజీసీఏకు నివేదిక అందజేస్తామని వెల్లడించారు. కాగా, శిక్షణ విమానం తలకిందులుగా పడిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శిక్షణ విమానం రన్‌వే పై పల్టీలు కొట్టింది. అనంతరం రన్‌వేకు సమీపంలో తలకిందులుగా పడింది. అదృష్టవశాత్తు అందులోని పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగింది ఈ షాకింగ్ ఘటన. తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 11.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. శిక్షణ విమానంలో ఒక్కరే ప్రయాణించే సెస్నా 172ఆర్ ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ రన్‌వే నుంచి టేకాఫ్ అయ్యేందుకు ప్రయత్నించింది. అయితే ఆ చిన్న విమానం రన్‌వే పై పల్టీలు కొట్టింది. అనంతరం రన్‌వేకు సమీపంలోని ఖాళీ ప్రాంతంలో తలకిందులుగా పడింది.
ప్రమాదాన్ని గమనించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే స్పందించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆ ఫ్లైట్‌కు మంటలు అంటుకోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రమాదంలోంచి బయటపడ్డ పైలట్‌ను సేఫ్‌గా బయటకు తీశారు. 34 ఏళ్ల అనూప్ నాయర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పైలెట్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. జరిగిన సంఘటన నేపథ్యంలో తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో గంట వరకు విమాన సేవలను నిలిపివేశారు. అలాగే మూడు కమర్షియల్ ఫ్లైట్లు ఆలస్యమైనట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపి డీజీసీఏకు నివేదిక అందజేస్తామని వెల్లడించారు. కాగా, శిక్షణ విమానం తలకిందులుగా పడిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్ట్ చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..