Vande Bharat Express: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. వారానికి రెండు నుంచి మూడు వందే భారత్ రైళ్లు.. ఎప్పటి నుంచంటే..

ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో.. త్వరగా గమ్య స్థానాలకు చేర్చేందుకు తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రతి వారం రెండు లేదా మూడు వందే భారత్...

Vande Bharat Express: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. వారానికి రెండు నుంచి మూడు వందే భారత్ రైళ్లు.. ఎప్పటి నుంచంటే..
కాగా, వందేభారత్‌ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైమాట.. ఏసీ చైర్ కారు రూ. 1150గా ఉండొచ్చునని సమాచారం.
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 08, 2023 | 8:42 PM

ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో.. త్వరగా గమ్య స్థానాలకు చేర్చేందుకు తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రతి వారం రెండు లేదా మూడు వందే భారత్ రైళ్లను నడిపించగలిగేలా ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తున్నామని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. వందేభారత్ రైళ్ల ద్వారా ప్రతి ప్రధాన నగరం, చిన్న పట్టణాలను కవర్ చేయాలనే ప్రధాన మంత్రి ఆశయాన్ని ఇది నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైల్వేలకు అధిక మొత్తం కేటాయించామని, వీటి ద్వారా దేశంలో రైల్వే వ్యవస్థను పటిష్టం చేయవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో తయారవుతోంది. చెన్నైతో పాటు.. హర్యానాలోని ఐసీఎఫ్ సోనిపట్, మహారాష్ట్రలోని ఐసీఎఫ్ లాతూర్, ఉత్తరప్రదేశ్‌లోని ఐసీఎఫ్ రాయ్ బరేలీకి విస్తరించనున్నారు. వచ్చే మూడేళ్లలో 500 కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.

భారతీయ రైల్వేలు 2025-26 నాటికి వందే భారత్ రైళ్లను ఎగుమతి చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఈ రైళ్ల డిజైన్, సాంకేతికత ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మేక్ ఇన్ ఇండియా చొరవకు గర్వించదగిన ఉదాహరణ ఈ రైళ్లు. ఇవి దేశీయంగా తయారయ్యాయి. ప్రతి ప్రధాన నగరం, చిన్న పట్టణాన్ని వందే భారత్ రైళ్లతో కవర్ చేయాలనే ప్రధాన మంత్రి దార్శనికతను నెరవేర్చడంపై దృష్టి సారించాం. వందే భారత్ రైళ్లకు పెరిగిన నిధులు, ఉత్పత్తి విస్తరణతో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించవచ్చు. భారతీయ రైల్వేలు.. దేశవ్యాప్తంగా 1,275 స్టేషన్‌లను పునరాభివృద్ధి చేస్తోంది.

   – అశ్వనీ వైష్ణవ్, కేంద్ర మంత్రి

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి 75 వందే భారత్ రైళ్లు, మూడు నాలుగేళ్లల్లో 400 వందే భారత్ రైళ్లు నడపాలన్నది భారతీయ రైల్వే లక్ష్యం. ఈ నెలలోనే మరిన్ని వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఫిబ్రవరి 10న ముంబయి – షిరిడీ, ముంబయి – షోలాపూర్ రూట్లలో రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ – తిరుపతి రూట్‌లో కూడా వందే భారత్ రైలు ఫిబ్రవరిలోనే ప్రారంభం కానుందన్న వార్తలొస్తున్నాయి. త్వరలో సికింద్రాబాద్ – బెంగళూరు రూట్‌లో కూడా వందే భారత్ రైలు సేవలు అందించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం