Ants Milk: చీమలు పాలు ఇస్తాయని మీకు తెలుసా? వాటిని తాగేదేవరో తెలిస్తే అవాక్కవుతారు..!

వేసవికాలం ప్రారంభమైందంటే చాలు.. ఇంట్లో చీమల బెడద మొదలవుతుంది. వాతావరణం వేడెక్కడమే ఆలస్యం.. వెంటనే ఆహారం వెతుక్కుంటూ ఇళ్ల నుంచి బయటకు వస్తాయి. చీమ చాలా చిన్న జీవి. అయినప్పటికీ, అది పాలు కూడా ఇస్తుందని మీకు తెలుసా? ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కానీ సైంటిస్టులు..

Ants Milk: చీమలు పాలు ఇస్తాయని మీకు తెలుసా? వాటిని తాగేదేవరో తెలిస్తే అవాక్కవుతారు..!
Ants Milk
Follow us
Shiva Prajapati

|

Updated on: May 29, 2023 | 9:11 PM

వేసవికాలం ప్రారంభమైందంటే చాలు.. ఇంట్లో చీమల బెడద మొదలవుతుంది. వాతావరణం వేడెక్కడమే ఆలస్యం.. వెంటనే ఆహారం వెతుక్కుంటూ ఇళ్ల నుంచి బయటకు వస్తాయి. చీమ చాలా చిన్న జీవి. అయినప్పటికీ, అది పాలు కూడా ఇస్తుందని మీకు తెలుసా? ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కానీ సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. చీమలు పెద్దయ్యాక ఒక రకమైన ద్రవాన్ని స్రవిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఒక రకమైన పాల మాదిరిగానే ఉంటుందని చెబుతున్నారు. ఈ పాలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి? ఈ పాలను ఎవరు తాగుతారు? వంటి ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చీమల పాలు ఎవరు తాగుతారు?

ప్యూపా నుండి వచ్చే ఈ పాలను వయోజన చీమలు, లార్వా రెండూ తాగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. లార్వా అనేది గుడ్డు, షెల్ నుండి ఉద్భవించే ఒక క్రిమి. జీవి అభివృద్ధి ప్రక్రియలో.. గుడ్డు నుండి ఒక లార్వా ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్యూపా వస్తుంది. ఆ తరువాత ప్యూపా వయోజనంగా మారుతుంది. ఇది అభివృద్ధి ప్రక్రియ క్రమం. ప్యూపా నుండి పాలను విడుదల చేయడం, చీమలు దాని వినియోగించడం జరుగుతుందని, ఇది వాటి మనుగడను కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నవజాత శిశువుకు పాలు ఎంత అవసరమో, అదే విధంగా చీమల లార్వాకు కూడా ఈ పాలు అవసరం అని పేర్కొంటున్నారు.

చాలా పోషకాలు..

చీమల నుండి వచ్చే ఈ పాలలో అమైనో ఆమ్లాలు, చక్కెరలు, విటమిన్లు ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. ఇది కాకుండా.. ఇతర పదార్థాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. ఈ ద్రవంపై మాత్రమే వాటి అభివృద్ధి ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ, చీమల పాలను సేకరించడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఎందుకంటే ఇది చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ అధ్యయనం ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురించారు. చీమల నుంచి పాలు వంటి పదార్థం రావడం మొదటిసారిగా గమనించినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ప్యూపా చనిపోతుంది..

వయోజన చీమలు ఈ ప్రక్రియలో చాలా ముఖ్యమైన ఈ ద్రవాన్ని తాగుతాయి. ఎందుకంటే ప్యూపా నుండి విడుదలయ్యే ఈ ద్రవం సకాలంలో తొలగించకపోతే.. ఆ ప్యూపాలు చనిపోయే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని సైన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..