Success Story: బిస్కెట్లు అమ్మి చదువుకున్న యువకుడు.. అమ్మ నగలు అమ్మి ఆ వ్యాపారం.. నేడు కంపెనీ విలువ 7000 కోట్లు..
చిన్న కుటీర పరిశ్రమగా మొదలైన సైకిల్ అగర్బత్తి కాలక్రమంలో నేడు దేశంలో పాపులర్ బ్రాండ్‌గా మారింది.. అయితే ఈ అగర్బత్తి జర్నీ అంత సులభంగా సాగలేదు.. అదే సమయంలో నేడు ఈ స్టేజ్ కు చేరుకోవడానికి అవిశ్రాంతం ఒకరు కృష్టి చేశారు ఎన్.రంగారావు.

పండగలు, పర్వదినాల్లో మాత్రమే కాదు రోజూ పూజ చేసే సమయంలో దీపం, ధూపం, నైవేద్యం తప్పనిసరి. ఇలా దూపం వేసేందుకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ సైకిల్ అగర్బత్తి నే ఎక్కువగా ఎంచుకుంటారు అంటే అతిశయోక్తి కాదు. చిన్న కుటీర పరిశ్రమగా మొదలైన సైకిల్ అగర్బత్తి కాలక్రమంలో నేడు దేశంలో పాపులర్ బ్రాండ్‌గా మారింది.. అయితే ఈ అగర్బత్తి జర్నీ అంత సులభంగా సాగలేదు.. అదే సమయంలో నేడు ఈ స్టేజ్ కు చేరుకోవడానికి అవిశ్రాంతం ఒకరు కృష్టి చేశారు ఎన్.రంగారావు. తన తెలివి తేటలు, సామర్థ్యంతో కోట్ల టర్నోవర్ కంపెనీగా చేరుకోవడానికి కృషి చేశారు. అయితే వాస్తవంగా ఎన్.రంగారావు బాల్యం పేదరికంతో గడిచింది.
దీంతో చిన్నతనంలో తన చదువుకు అయ్యే ఖర్చులను తానే సంపాదించుకున్నారు. ఇందుకోసం రంగారావు బిస్కెట్లు అమ్మారు కూడా.. నాటి నిరుపేద.. నేడు కొన్ని వేల కోట్ల సంస్థకు అధిపతిగా ఎలా మారారు.. ఎన్ రంగారావు తన అసాధారణ ప్రతిభతో ఈ స్థానాన్ని ఎలా సాధించారో తెలుసుకుందాం..
చిన్నతనంలోనే మరణించిన తండ్రి..




ఎన్ రంగారావు 1912లో సాధారణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు. అయితే రంగారావు 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. దీంతో కుటుంబ బాధ్యత తన చిన్నతనంలో మోయాల్సి వచ్చింది. అయితే రంగారావుకు చదువుపై విపరీతమైన ఆసక్తి ఉంది. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. అయినప్పటికీ చదువుకోవాలనే కోరికను రంగారావు వదులుకోలేదు. ఎన్ రంగారావు పట్టు వదలతో చదువు కొనసాగించేందుకు తన స్కూల్ బయట బిస్కెట్లు అమ్మడం మొదలుపెట్టారు. అలా బిస్కెట్లు అమ్మి వచ్చిన డబ్బుతో ఫీజు కట్టడమే కాకుండా మిగిలిన డబ్బును ఇంటి ఖర్చుల కోసం ఇచ్చేవారు.
వ్యాపారం కోసం ఉద్యోగానికి గుడ్ బై
ఎన్.రంగారావు 1930లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగం కోసం అరువ్‌కండు వెళ్లారు. అక్కడ ఓ ఫ్యాక్టరీలో గుమస్తాగా పనిచేయడం ప్రారంభించారు. అయినప్పటికీ తాను చేస్తున్న ఉద్యోగం నచ్చక 1948లో ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎన్ రంగారావు వ్యాపారం చేసేందుకు తమ ఇంట్లో ఉన్న అమ్మ నగలు అమ్మేశారు. కేవలం 4000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
అగరబత్తికి సైకిల్ అని ఎందుకు పేరు పెట్టారంటే?
సైకిల్ ఎన్ రంగారావు చాలా ఆలోచించి అగర్బత్తిల తయారు మొదలు పెట్టారు. అంతేకాదు వ్యాపారం చేయడం ప్రారంభించిన కొత్తలో సైకిల్‌పై వీధి వీధి తిరుగుతూ అగరబత్తులు అమ్మేవాడు. ఇలా చేయడం వలన తన అగర్బత్తిలు సామాన్యులను కూడా ఆకర్షిస్తాయని భావించారు. అంతేకాదు మహిళలకు ఉపాధి కల్పించేందుకు.. వారికీ అగరబత్తీలను తయారు చేయడం నేర్పారు. అలా మహిళలతో అగరబత్తిలను తయారు చేయించి.. వారిని ఉపాధి మార్గంలో పయనించే విధంగా అడుగులు వేయించారు. అంతేకాదు ” ఎన్ ఆర్ గ్రూప్” పేరుతో ఒక కంపెనీని కూడా ప్రారంభించారు.
1980 సంవత్సరంలో మరణం
రంగారావు 1980 సంవత్సరంలో మరణించారు. అతని మరణం తరువాత వ్యాపారం అతని కొడుకులు వారసులుగా అందుకున్నారు. వారు కూడా ఈ అగరబత్తీల కంపెనీని విజయవంతంగా నడుపుతున్నారు. ప్రస్తుతం కంపెనీ వ్యాపారం 7 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. నేడు అతని వ్యాపారం 65 దేశాలలో విస్తరించి ఉంది. అమితాబ్ బచ్చన్, సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖులు సైకిల్ అగర్బత్తికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..