Viral Video: నిద్రలో మహిళ కాలికి చుట్టుకున్న తాచుపాము.. మూడు గంటలు శివ నామస్మరణ చేసిన మహిళ.. వీడియో వైరల్

హమీర్‌పూర్ జిల్లా దేవిగంజ్ గ్రామంలో నివసించే మిథిలేష్ కుమారి యాదవ్ రాఖీ పండగ సందర్భంగా సొంత ఇంటికి వచ్చింది. ఆ మహిళ నిద్రిస్తున్న సమయంలో పాము ఆ మహిళ కాలికి చుట్టుకుంది. తన కాలికి చుట్టుకున్న విషసర్పాన్ని చూడగానే మిథిలేష్‌కి శివుడు గుర్తుకొచ్చాడు. ఆమె పాముని చూస్తూనే శివయ్యను ధ్యానిస్తూనే ఉంది. ఈ సంఘటనకు చెందిన వీడియో కూడా బయటపడింది.

Viral Video: నిద్రలో మహిళ కాలికి చుట్టుకున్న తాచుపాము.. మూడు గంటలు శివ నామస్మరణ చేసిన మహిళ.. వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 29, 2023 | 11:46 AM

నార్త్ ఇండియాలో శ్రావణ సోమవారం శివయ్య పూజకు అత్యంత ఫలవంతంగా భావిస్తారు. భక్తి శ్రద్దలతో శివుడిని పూజిస్తారు. అయితే శ్రావణ సోమవారం రోజున ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక వింత సంఘటన చోటు చేసుకున్నట్లు ఒక వార్త తెరపైకి వచ్చింది. ఒక పాము మహిళ కాలికి చుట్టుకుని సుమారు 3 గంటల పాటు అలాగే ఉంది. పాముని చూసి భయపడకుండా ఉన్న ఆ స్త్రీ అటుఇటు కదలకుండా నిటారుగా కూర్చుని శివ నామాన్ని జపిస్తూనే ఉంది. ఇది గమనించిన బంధువులు వెంటనే పాము పట్టే వ్యక్తికి ఫోన్ చేశారు. ఆ పాములు పట్టే వ్యక్తికి వచ్చి మహిళ కాలికి చుట్టుకున్న పామును పట్టుకున్నాడు. దీంతో ఆ మహిళ ఊరి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది. విషపూరితమైన పాము మహిళ కాలికి చుట్టుకుని ఉంది కానీ.. అసలు ఎందుకు హాని చేయలేదని అందరూ ఆశ్చర్యపోయారు.

సమాచారం ప్రకారం ఈ మొత్తం వ్యవహారం సంగం సదర్ తహసీల్‌లోని దహ్రా గ్రామంలో చోటు చేసుకుంది.  హమీర్‌పూర్ జిల్లా దేవిగంజ్ గ్రామంలో నివసించే మిథిలేష్ కుమారి యాదవ్ రాఖీ పండగ సందర్భంగా సొంత ఇంటికి వచ్చింది. ఆ మహిళ నిద్రిస్తున్న సమయంలో పాము ఆ మహిళ కాలికి చుట్టుకుంది. తన కాలికి చుట్టుకున్న విషసర్పాన్ని చూడగానే మిథిలేష్‌కి శివుడు గుర్తుకొచ్చాడు. ఆమె పాముని చూస్తూనే శివయ్యను ధ్యానిస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటనకు చెందిన వీడియో కూడా బయటపడింది. దీనిలో మహిళ తన గదిలోని మంచం మీద మంచం మీద కూర్చోవడం.. ఆమె కాలికి పాము చుట్టినట్లు స్పష్టంగా చూడవచ్చు. పాము పడగ విప్పి కాటేసేటట్లుగా ఉంది. అప్పుడు ఆ స్త్రీ చేతులను జోడించి శివుడిని స్మరిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాములు పట్టేవాడిని పిలిపించి పామును ఆ మహిళ కాలి నుంచి క్షేమంగా బయటకు తీశారు.

దైవంపై గెలిచిన విశ్వాసం

తన కాలికి చుట్టుకుని ఉన్న పాముని చూసి మొదట భయపడినట్లు మిథిలేష్ కుమారి చెప్పింది. అయితే తనకు దేవుడిపై అపారమైన నమ్మకం ఉందని.. అందుకనే పామును తరిమికొట్టే ప్రయత్నం చేయకుండా ప్రశాంతంగా ఉండిపోయినట్లు చెప్పాడు. అందుకనే తన స్థానంలో కూర్చుని శివుని స్మరిస్తూనే ఉంది. ఈ ఉదంతం ఊరంతా చర్చనీయాంశం అవుతున్నప్పటికీ.. మూడు గంటల పాటు విషసర్పం ఆ మహిళ కాలికి చుట్టుకున్నా ఎలాంటి హాని చేయకపోవడంతో శివయ్య మహిమ అంటూ అభివర్ణిస్తున్నారు కొందరు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..