Watch Viral Video: భూమిపై పుట్టిన గ్రహాంతరవాసి..! వింత శిశువు వీడియో వైరల్‌.. సోషల్ మీడియాలో చర్చనీయాంశం..

ఈ శిశువు అరుదైన వ్యాధితో బాధపడుతుందని వైద్యులు తెలిపారు. అందుకే ఇతర శిశువులతో పోలిస్తే ఈ చిన్నారి భిన్నంగా కనిపిస్తుంది. ఈ పాప అరుదైన జన్యుపరమైన వ్యాధితో జన్మించింది. ఈ పాపకు హార్లెక్విన్ ఇచ్థియోసిస్ అనే జన్యుపరమైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. అతని శరీరమంతా పగుళ్లు కనిపిస్తున్నాయి. ఈ పాప వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.

Watch Viral Video: భూమిపై పుట్టిన గ్రహాంతరవాసి..! వింత శిశువు వీడియో వైరల్‌.. సోషల్ మీడియాలో చర్చనీయాంశం..
Unique Child Birth
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 29, 2023 | 1:25 PM

తల్లి కావడం అనేది ప్రతి స్త్రీ జీవితానికి ఓ కొత్త జన్మగా భావిస్తారు. ప్రతి తల్లికి తన బిడ్డ ప్రత్యేకమైనది. తల్లి తన కడుపులో ఉన్న బిడ్డను తొమ్మిది నెలల పాటు మోస్తుంది. పురిటి నొప్పులు భరిస్తూ ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ప్రతి తల్లికి తన బిడ్డ అమూల్యమైన బహుమతి. ఆ బిడ్డ ఎలా ఉన్న కూడా తల్లికి ప్రాణమే. ప్రతి దుఃఖం, ప్రమాదం నుండి బిడ్డను సురక్షితంగా కాపాడుకుంటుంది. బిడ్డ క్షేమం కోసం తల్లి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పిల్లలకు ఏ చిన్న అనారోగ్యం కలిగినా ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. అయితే, కొంతమంది పిల్లలు అరుదైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధులలో కొన్ని వైద్యులు కూడా నయం చేయలేనివి ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అరుదైన వ్యాధితో ఓ పాప పుట్టింది. ప్రస్తుతం ఈ పాప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న పాప చర్మం పూర్తిగా తెల్లగా ఎలియన్ మాదిరిగా కనిపిస్తుంది. దీనితో పాటు శిశువు చర్మంపై పగుళ్లు కనిపిస్తున్నాయి. ఈ పాపను చూసి డాక్టర్‌తో పాటుగా తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by KBK FOUNDATION (Oluseyi Odewale) (@kbkonline)

సోషల్ మీడియాలో శిశువు వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఈ పాప శరీరం మొత్తం తెల్లగా ఉండటం కనిపిస్తుంది.అయితే నోరు, కళ్లు మాత్రం ఎర్రగా ఉన్నాయి. అతని శరీరమంతా పగుళ్లు కనిపిస్తున్నాయి. ఈ పాప వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో పాపను గ్రహాంతర వాసితో పోలుస్తున్నారు. కొందరు దీనిని గ్రహాంతరవాసి అని కూడా పిలుస్తున్నారు.

ఈ శిశువు అరుదైన వ్యాధితో బాధపడుతుందని వైద్యులు తెలిపారు. అందుకే ఇతర శిశువులతో పోలిస్తే ఈ చిన్నారి భిన్నంగా కనిపిస్తుంది. ఈ పాప అరుదైన జన్యుపరమైన వ్యాధితో జన్మించింది. ఈ పాపకు హార్లెక్విన్ ఇచ్థియోసిస్ అనే జన్యుపరమైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది.

ఈ వ్యాధికి మందు లేదు..

హార్లెక్విన్ ఇచ్థియోసిస్‌తో బాధపడుతున్న పిల్లవాడు నెలలు నిండకుండా అంటే తొమ్మిది నెలల ముందు జన్మించినట్లు కనిపిస్తుంది. వారి శరీరంపై చర్మం మందంగా, గట్టిగా ఉంటుంది. పగుళ్లు కూడా కనిపిస్తాయి. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యాధికి చికిత్స లేదు. వీడియోలో ఉన్న పిల్లవాడికి కూడా అదే జన్యుపరమైన వ్యాధి ఉంది. అందుకే ఈ పాప ఇలా కనిపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..