AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఈ రెస్టారెంట్‌లో ఉద్యోగం.. జీతం, సౌకర్యాల ముందు కార్పొరేట్ సంస్థ కూడా దిగదుడుపే.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కొన్నిసంస్థల్లో మంచి సౌకర్యాలు ఉంటే .. మంచి జీతం ఉండదు.. రెండు కలిసి ఉన్న ఉద్యోగం దొరికితే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.  ఈ రోజు మనం ఓ ఉద్యోగావకాశం కోసం తెలుసుకోబోతున్నాం.. ఇక్కడ ఉద్యోగులకు అద్భుతమైన సౌకర్యాలను కల్పించడమే కాదు.. మంచి జీతాన్ని కూడా అందిస్తోంది .. ఈ రెస్టారెంట్ లోని ఉద్యోగం ముందు కార్పొరేట్ ఉద్యోగాలు కూడా దిగదుడుపే అనిపిస్తుంది ఎవరికైనా .. 

Viral News: ఈ రెస్టారెంట్‌లో ఉద్యోగం.. జీతం, సౌకర్యాల ముందు కార్పొరేట్ సంస్థ కూడా దిగదుడుపే.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Viral News
Surya Kala
|

Updated on: Aug 29, 2023 | 1:38 PM

Share

ఉద్యోగం చేయాలంటే ముందుగా కోరుకునేది.. మంచి జీతం.. అందుకు తగిన సౌకర్యాలు. ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న చోట పని చేయడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపిస్తారు. అయితే ఇంత మంచి ఉద్యోగం అందరికి దక్కదు. ఎవరికైతే అదృష్టం ఉంటుందో.. వారికీ మాత్రమే దక్కుతుందని భావిస్తారు.  కొందరికి మంచి కంపెనీలో ఉద్యోగం దొరికి మంచి జీతం ఉన్నా.. సౌకర్యాలు ఉండేవి. కొన్నిసంస్థల్లో మంచి సౌకర్యాలు ఉంటే .. మంచి జీతం ఉండదు.. రెండు కలిసి ఉన్న ఉద్యోగం దొరికితే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.  ఈ రోజు మనం ఓ ఉద్యోగావకాశం కోసం తెలుసుకోబోతున్నాం.. ఇక్కడ ఉద్యోగులకు అద్భుతమైన సౌకర్యాలను కల్పించడమే కాదు.. మంచి జీతాన్ని కూడా అందిస్తోంది .. ఈ రెస్టారెంట్ లోని ఉద్యోగం ముందు కార్పొరేట్ ఉద్యోగాలు కూడా దిగదుడుపే అనిపిస్తుంది ఎవరికైనా ..

సింగపూర్‌లోని రెస్టారెంట్‌కు సర్వీస్ సిబ్బంది, కిచెన్ సిబ్బంది అవసరం. ఈ రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చేయాలంటే అప్పుడు కూడా మంచి జీతం ఇస్తారు. అదే ఇక ఫుల్ టైం ఉద్యోగం చేసే ఉద్యోగులకు ఇచ్చే జీతం, అదనపు సదుపాయాలు తెలిస్తే మనసుకు సంతోషం కలుగుతుంది. రెస్టారెంట్ పార్ట్ టైమ్ సర్వీస్ చేసే సిబ్బందికి గంటకు రూ. 826 నుండి రూ. 1240 వరకు $ 10-15 మధ్య జీతం చెల్లిస్తుంది. అయితే ఫుల్ టైమ్ సర్వీస్ చేసే సిబ్బందికి $ 2750 నుండి $ 3300 అంటే మన దేశ కరెన్సీలో రూ. 2, 27,00 నుండి రూ. 2, 72,000  మధ్య జీతం లభిస్తుంది. అంతేకాదు ఈ భారీ జీతంతో పాటు ఉన్న సౌకర్యాల గురించి మీకు తెలిస్తే మీరు మరింత ఆశ్చర్యపోతారు.

సౌకర్యాలలో మొదటిది సిబ్బంది భత్యం.. అదనపు భత్యం, ఉచిత భోజనం కూడా ఉంటుంది. అంతేకాదు  ఉద్యోగులకు మెడికల్ బెనిఫిట్స్ , హెల్త్ ఎగ్జామినేషన్ రాయితీని ఇస్తున్నారు. అలాగే వార్షిక దంత ప్రయోజనాలను పొందుతారు.. అంటే ఉద్యోగుల దంతాలకు ఏదైనా సమస్య ఉంటే.. మీరు డబ్బు ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్సను పొందవచ్చు. ఇవి మాత్రమే కాదు.. ఉద్యోగులు వార్షిక ఇంక్రిమెంట్ ని ఇస్తారు.  ఇక ఉద్యోగస్తులు తమ చదువుని కొనసాగించాలంటే స్టడీ లీవ్ కూడా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు రెస్టారెంట్ తన ఉద్యోగులకు వివిధ బోనస్‌లను కూడా ఇస్తుంది. మొదటి బోనస్ పనితీరు,  హాజరు ప్రకారం ఇస్తారు. అది కూడా సంవత్సరానికి రెండుసార్లు ఇస్తారు. రెండవ బోనస్ నెలవారీ ఆదాయ ప్రోత్సాహక బోనస్ ..  మూడవ బోనస్ రెఫరల్ బోనస్. దీనితో పాటు ఒక ఉద్యోగి స్టడీ కోర్సు చేయాలనుకుంటే రెస్టారెంట్ ఆ ఉద్యోగస్థుడుని స్పాన్సర్ చేస్తుంది. అంటే చదువుకు అయ్యే ఖర్చులను రెస్టారెంట్ భరిస్తుంది. ఇంత మంచి జీతంతో పాటు ఇంత మంచి సౌకర్యాలు లభిస్తే ఎవరైనా సరే ఈ రెస్టారెంట్ లో పని చేయడానికి ఆసక్తిని చూపించరు చెప్పండి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
ముంబైలో కాలి బూడిదైన జగిత్యాల బస్సు!
ముంబైలో కాలి బూడిదైన జగిత్యాల బస్సు!
దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు..
దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు..
హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!
ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!
ఖర్చు లేని మ్యాజిక్.. బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలా...?
ఖర్చు లేని మ్యాజిక్.. బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలా...?
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన
నువ్వేకావాలి ఫస్ట్ మహేష్‌తో తీద్దామనుకున్నాం.. కానీ అసలు జరిగింది
నువ్వేకావాలి ఫస్ట్ మహేష్‌తో తీద్దామనుకున్నాం.. కానీ అసలు జరిగింది
నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..
నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..