- Telugu News Photo Gallery Business photos Know about Air Conditoners with zero electricity bill, which can even run 24 hours Telugu News
New Air Conditioners: జీరో కరెంట్ బిల్లుతో ఏసీ.. 24 గంటలు నడుస్తుంది.. ఇక సమ్మర్‌లో బిందాస్..!
AC ధర కంటే ఎక్కువగా దాంతో వచ్చే కరెంటు బిల్లుకు భయపడుతుంటారు చాలా మంది ప్రజలు, వినియోగదారులు. అలాగని AC కొనకుండా ఉంటారు. పాపం ఎండాకాలంలో ఉక్కపోత, చెమటతో ఉక్కిరిబిక్కిర అవుతుంటారు. అయితే, ఇప్పుడు జీరో కరెంటు బిల్లు ఏసీలు కూడా మార్కెట్ లోకి వచ్చాయి. అవును నిజమే..? అవి ఏంటో, ఎలా పనిచేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Aug 29, 2023 | 12:41 PM

సోలార్ ప్యానెళ్ల ద్వారా సూర్యరశ్మి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తుపై సోలార్ ఏసీ పనిచేస్తుంది. ఇది విద్యుత్ బిల్లులో ఉపశమనం కలిగిస్తుంది. సాధారణ ఏసీని నడపాలంటే చాలా విద్యుత్ ఖర్చవుతుంది. అలాగే దీని నిర్వహణ ఖర్చు కూడా చాలా ఎక్కువ. అదే సోలార్ ఏసీతో అలాంటి సమస్య ఉండదు.

సాధారణ ఏసీల కంటే సోలార్ ఏసీలు ఎక్కువ పవర్ ఆప్షన్‌లను కలిగి ఉంటాయి. సాధారణ ఏసీ విద్యుత్తుపై మాత్రమే పనిచేస్తుంది. సోలార్ ఎసి మూడు విధాలుగా పనిచేస్తుంది. సౌరశక్తి, సోలార్ బ్యాటరీ బ్యాంక్, ఇంకా విద్యుత్.

సోలార్ ఏసీ కోసం ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవాలి. సోలార్ ప్యానెల్‌లు పగటిపూట మాత్రమే పని చేస్తున్నప్పటికీ, మీకు బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ కూడా లభిస్తుంది. దాంతో మీరు రాత్రిపూట కూడా బ్యాటరీ ద్వారా ACని నడపడానికి అవసరమైన అదనపు విద్యుత్‌ను పొందుతారు.

అయితే.. సాధారణ ఏసీ కంటే సోలార్ ఏసీ ఖరీదు ఎక్కువ. కానీ, సాధారణ ఏసీకి బదులు సోలార్ ఏసీని అమర్చుకుంటే కరెంటు బిల్లు జీరో అవుతుంది. మీరు మీ సమీప మార్కెట్ నుండి దాని ధరను చెక్ చేసుకోవచ్చు. అలాగే.. కొన్ని వెబ్‌సైట్లలో సోలార్ ఏసీలు కూడా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. మీరు సోలార్ ఏసీని ఈ విధంగా కొనుగోలు చేయవచ్చు.

సోలార్ ఏసీని అమర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సాధారణ ఏసీల కరెంట్ ఖర్చుకానివ్వదు. ఇది మీ కరెంట్ బిల్లు భారాన్ని తగ్గిస్తుంది. ఆటో స్టార్ట్ మోడ్, టర్బో కూల్ మోడ్, డ్రై మోడ్, స్లీప్ మోడ్, ఆన్ ఆఫ్ టైమర్, ఆటో క్లీన్, స్పీడ్ సెట్టింగ్, లవర్ స్టెప్ అడ్జస్ట్, రిమోట్‌లోని గ్లో బటన్ వంటి సాధారణ ఏసీలో మీకు లభించే అన్ని ఫీచర్లు ఈ ఏసీలో కూడా ఉన్నాయి.





























