AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఇద్దరి స్నేహం పూర్వం.. 8ఏళ్ల బాలుడు, గుర్రం మధ్య దోస్తీ.. స్కల్‌కి కూడా ఇద్దరూ కలిసే..!

ఖాళీ సమయంలో పాఠశాలలోని ఇతర విద్యార్థులు గుర్రానికి ఆహారం ఇస్తూ దానితో ఆడుకుంటారు. విద్యార్థి కుటుంబీకుల తెలిపిన వివరాల ప్రకారం, కుష్ ఒకసారి పొలంలో పనికి వెళుతున్నప్పుడు ఈ గుర్రం కనిపించింది. తనతో పాటు తెచ్చి పెంచుతున్నాడు. కుష్ ఎక్కడికి వెళ్లినా అది అతనికి తోడుగా ఉండేది. ఇప్పుడు కుష్‌ కూడా దానితోనే తిరుగుతున్నాడు.

ఈ ఇద్దరి స్నేహం పూర్వం.. 8ఏళ్ల బాలుడు, గుర్రం మధ్య దోస్తీ.. స్కల్‌కి కూడా ఇద్దరూ కలిసే..!
8th Class Student Rides Horse
Jyothi Gadda
|

Updated on: Aug 29, 2023 | 10:55 AM

Share

విద్యార్థులు సాధారణంగా రిక్షా, వ్యాన్, బస్సు, సైకిల్‌పై స్కూల్‌కి వెళ్లడం మనం చూశాం. అయితే గుజరాత్‌లోని సూరత్ జిల్లా బార్డోలి తాలూకాకు చెందిన ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థి రోజూ గుర్రంపై పాఠశాలకు వస్తున్నాడు. విద్యార్థి పేరు కుష్ మహేశ్‌భాయ్ రాథోడ్. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి వయస్సు 13 ఏళ్లు. విద్యార్థి కుటుంబం వ్యవసాయం చేసుకుంటోంది. కుష్ దాదాపు ఐదు సంవత్సరాల వయస్సులో గుర్రంపై ఎక్కి స్కూల్‌కి వెళ్లటం మొదలుపెట్టాడు.

సూరత్ జిల్లా బార్డోలి తాలూకాలోని ఖర్వాసా అనే చిన్న గ్రామానికి చెందిన కుష్‌ గుర్రంపై స్కూలుకు వెళ్లడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్న వయసులోనే మహేశ్‌భాయ్ రాథోడ్ గుర్రంపై స్కూలుకు వెళ్లడం అద్భుతంగా ఉంది. ప్రతి రోజు, కుష్ తన ఇంటి నుండి గుర్రపు స్వారీ చేస్తూ పాఠశాలకు వస్తాడు. క్లాసుకి వెళ్లే ముందు గుర్రాన్ని స్కూల్ బయట కట్టేసి మేతవేస్తాడు. బైక్‌లు, బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో వచ్చే ఉపాధ్యాయులు సైతం కుష్‌కు గుర్రాలపై ఉన్న ప్రేమను చూసి విద్యార్థులు ఆశ్చర్యపోతున్నారు. కాసేపు గుర్రంతో ఆడుకుంటూ సంబరాలు కూడా చేసుకుంటారు.

కుష్ రాథోడ్ గత నాలుగేళ్లుగా గుర్రపు స్వారీ చేస్తూ పాఠశాలకు వస్తున్నాడు. ఖాళీ సమయంలో పాఠశాలలోని ఇతర విద్యార్థులు గుర్రానికి ఆహారం ఇస్తూ దానితో ఆడుకుంటారు. విద్యార్థి కుటుంబీకుల తెలిపిన వివరాల ప్రకారం, కుష్ ఒకసారి పొలంలో పనికి వెళుతున్నప్పుడు ఈ గుర్రం కనిపించింది. తనతో పాటు తెచ్చి పెంచుతున్నాడు. కుష్ ఎక్కడికి వెళ్లినా అది అతనికి తోడుగా ఉండేది. ఇప్పుడు కుష్‌ కూడా దానితోనే తిరుగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా
సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా
రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!
రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!
మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!
మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!
రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!
బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్
బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్
గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష
గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి
వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి
జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..
గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..
ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!
ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!