AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

38 ఏళ్ల క్రితమే చదువు వదిలేసిన ఆటోడ్రైవర్‌… ఇంగ్లీష్ లో సాధించిన మార్కులు తెలిస్తే నోరెళ్లబెడతారు..

చదువుకోడానికి వయోపరిమితి లేదు.. చదువుకోవాలనే తపన ఉండాలే గానీ, ఏ వయసు వారైనా సరే తమ చదువును కంటీన్యూ చెయొచ్చునని పలువురు నెటిజన్లు స్పందించారు. ఈ ఫోటో సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు దీనిని చూసి సంతోషిస్తున్నారు.

38 ఏళ్ల క్రితమే చదువు వదిలేసిన ఆటోడ్రైవర్‌... ఇంగ్లీష్ లో సాధించిన మార్కులు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Bengaluru Auto Driver
Jyothi Gadda
|

Updated on: Aug 29, 2023 | 7:44 AM

Share

చదువుకోవాలన్నదే అందరి కల. కానీ కొందరికి ఆ కల కలగానే మిగిలిపోతుంది. పరిస్థితుల ఒత్తిడితో చదువు మానేసేవారు కొందరైతే, కొంతమందికి చదవడం ఇష్టం ఉండదు. కానీ, చదువుకోవలనే తపన ఉండాలేగానీ, వయసు సంబంధం లేదని మరికొందరు అంటున్నారు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు బెంగళూరుకు చెందిన ఓ ఆటోడ్రైవర్.. అతనోక ఆటో డ్రైవర్‌.. కానీ, ఇప్పుడు అందరి దృష్టి అతనిపై పడింది. ఎందుకంటే.. అతడు ఎవరూ సాహసించని పనిచేసి విజయం సాధించాడు. బెంగుళూరుకు చెందిన ఆ ఆటోడ్రైవర్ పాఠశాల జీవితాన్ని విడిచిపెట్టిన 38 ఏళ్ల తర్వాత పీయూసీ ఇంగ్లీష్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ విషయాన్ని నిధి అగర్వాల్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దాంతో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

బెంగుళూరుకు చెందిన నిధి అగర్వాల్ ఇటీవల ట్విటర్‌లో ఒక పోస్ట్‌ను షేర్‌ చేశారు. ఇది సర్వత్రా వైరల్ అవుతోంది. ఆటో రిక్షా డ్రైవర్‌ 38ఏళ్ల తర్వాత స్కూల్‌కు వెళ్లిన కథనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్విట్టర్‌లో ఒక ఆటో డ్రైవర్ ఫోటోతో పాటు, క్యాప్షన్‌లో ఇలా రాశారు.. “ఈరోజు నా @Olacabs ఆటో మేట్ బాస్కర్ ని పరిచయం చేస్తున్నాను. అతను ఈ రోజు తన ఇంగ్లీష్ ఎగ్జామ్‌ రాశాడు. అతను 1985లో 10వ తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత ఈ సంవత్సరం PUC పరీక్షలు రాశాడు. అతడు ఇద్దరు పిల్లల తండ్రి. పిల్లలు ఒకరు 3వ తరగతి, 6వ తరగతి చదువుతున్నారు. ఈ వయసులో చదువుకుని పరీక్ష రాసినందుకు అతడు సంతోషంగా ఉన్నాడు. ఆటో డ్రైవర్‌ బాస్కర్‌ ఎంతో మందికి ఆదర్శం అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

— నిధి అగర్వాల్ (@Ngarwalnidhi) ఆగస్టు 26న పోస్ట్‌ చేసిన ఈ ఫోటో వైరల్‌గా మారింది.

చదువుకోడానికి వయోపరిమితి లేదు.. చదువుకోవాలనే తపన ఉండాలే గానీ, ఏ వయసు వారైనా సరే తమ చదువును కంటీన్యూ చెయొచ్చునని పలువురు నెటిజన్లు స్పందించారు. ఈ ఫోటో సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు దీనిని చూసి సంతోషిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..