Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3 Quiz Competition:సెప్టెంబర్ 1 నుండి చంద్రయాన్-3 పై క్విజ్ పోటీ.. యువతకు టాస్క్‌ ఇచ్చిన ప్రధాని మోదీ

బెంగళూరులో మూన్ మిషన్‌తో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలను కలిసిన ప్రధాని మోదీ వారిని అభినందించారు.  ఇస్రో చీఫ్ ఎస్.  సోమనాథ్‌ను కలిసి ప్రశంసించారు. మిషన్‌కు సంబంధించిన మొత్తం ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఇస్రో కమాండ్ సెంటర్‌లో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించినప్పుడు, మొదట్లో ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మూన్‌ మిషన్‌లో విజయం సాధించిన తర్వాత ఇక్కడికి రావాలని ఆతృతగా ఎదురుచూశానని కూడా చెప్పారు.

Chandrayaan-3 Quiz Competition:సెప్టెంబర్ 1 నుండి చంద్రయాన్-3 పై క్విజ్ పోటీ.. యువతకు టాస్క్‌ ఇచ్చిన ప్రధాని మోదీ
Pm Modi
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 27, 2023 | 8:34 PM

Chandrayaan-3 Quiz Competition: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం చంద్రయాన్-3కి సంబంధించి భారీ క్విజ్ పోటీని ప్రకటించారు. ఇది 01 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభమవుతుంది. దేశంలోని విద్యార్థులకు ఇది చాలా పెద్ద, మంచి అవకాశం అని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని విద్యార్థులు ఈ క్విజ్‌లో పాల్గొనాలని ఆయన కోరారు. దక్షిణాఫ్రికా, గ్రీస్‌లలో 4 రోజుల పర్యటన అనంతరం ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ కర్ణాటకలోని బెంగళూరులో చేరుకున్నారు. అక్కడ విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్‌కు బాధ్యత వహించిన ఇస్రో బృందాన్ని కలిశారు మోదీ. ఢిల్లీలో ప్రజలను ఉద్దేశించి ఆయన చంద్రయాన్-3 క్విజ్ పోటీని ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి MyGov పోర్టల్‌లో ఈ పోటీలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ క్విజ్‌లో పాల్గొనగలరు. చంద్రయాన్-3కి సంబంధించిన క్విజ్ పోటీలో పాల్గొనవలసిందిగా విద్యార్థులందరినీ ప్రోత్సహించారు.

ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ యుగం అని, సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ దేశానికి పట్టిస్తుందో ఆ దేశమే ఈ యుగాన్ని నడిపిస్తుందని అన్నారు. మనకు శాస్త్రీయ ఆలోచన అవసరం. యువత కోసం హ్యాకథాన్‌ల శ్రేణిని నిర్వహించాలనుకుంటున్నాము. ప్రజా సమస్యల పరిష్కారానికి యువకులను ఉపయోగించుకోవడమే హ్యాకథాన్ సిరీస్ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ.

కాలక్రమేణా స్పేస్ అప్లికేషన్ పరిధి యువతకు కొత్త అవకాశాలను తెరుస్తోందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశం వేల సంవత్సరాల క్రితమే భూమి వెలుపల అనంత అంతరిక్షంలోకి చూడటం ప్రారంభించింది. శతాబ్దాల క్రితమే పరిశోధనా సంప్రదాయానికి చెందిన ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, వరాహ్మిహిరుడు వంటి మహానుభావులు మనకు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

బెంగళూరులో మూన్ మిషన్‌తో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలను కలిసిన ప్రధాని మోదీ వారిని అభినందించారు.  ఇస్రో చీఫ్ ఎస్.  సోమనాథ్‌ను కలిసి ప్రశంసించారు. మిషన్‌కు సంబంధించిన మొత్తం ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఇస్రో కమాండ్ సెంటర్‌లో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించినప్పుడు, మొదట్లో ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మూన్‌ మిషన్‌లో విజయం సాధించిన తర్వాత ఇక్కడికి రావాలని ఆతృతగా ఎదురుచూశానని కూడా చెప్పారు. దేశ భవిష్యత్తు దిశను నిర్ణయించుకోవాలని శాస్త్రవేత్తలకు ప్రధాని చెప్పారు. ‘జై విజ్ఞాన్-జై అనుబంధ్’ అంటూ మోడీ కొత్త నినాదం కూడా ఇచ్చారు.

నేషనల్ స్పేస్ డే.. చంద్రయాన్ ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. ఇప్పుడు ఈ రోజు (ఆగస్టు 23)ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారతదేశం చంద్రునిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆగస్టు 23న, ఆ రోజును భారతదేశం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుంది అని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..