AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి ఆహారాలను తినండి..!

దీనిని నివారించడానికి, దానిమ్మ, గింజలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినండి. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.  అలాగే, మెగ్నీషియం లోపాన్ని తగ్గించుకోవడానికి గుమ్మడి గింజలు, బాదం, బచ్చలికూర, జీడిపప్పు, వేరుశెనగలను తినండి. ఫోలేట్, విటమిన్ బి12 లోపాన్ని నివారించడానికి ఆకుకూరలు, చిక్కుళ్ళు, పొద్దుతిరుగుడు విత్తనాలు, తృణధాన్యాలు, తాజా పండ్లను తినండి.

వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి ఆహారాలను తినండి..!
Women Health
Jyothi Gadda
|

Updated on: Aug 28, 2023 | 11:26 AM

Share

కుటుంబ సంరక్షణ, విధి నిర్వహణ బాధ్యతలతో ఎప్పుడు బిజీగా ఉండే చాలా మంది మహిళలు తమ ఆరోగ్య విషయాన్ని పట్టించుకోరు. తమ ఆరోగ్యం, ఆహారంపై పెద్దగా శ్రద్ధ చూపరు. ఫలితంగా అది మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు  మహిళలు శరీర ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. మొత్తం ఆరోగ్యానికి పౌష్టికాహారం అవసరం. కాబట్టి మహిళలు తమ ఆహారంలో ఎక్కువ పోషకాలు, మొత్తం ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా ముప్పై ఏళ్ల తర్వాత రక్తహీనత, బలహీనత, ఎముకల బలహీనత, శక్తి లేకపోవడం, థైరాయిడ్, బరువు పెరగడం వంటి అనేక వ్యాధులు దాడి చేయటం సాధారణం. సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం అవసరం. కాబట్టి మహిళలు తమ ఆహారంలో ఎక్కువ పోషకాలు, ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

విటమిన్ లేదా మినరల్ లోపం స్త్రీలను బలహీనపరుస్తుంది. దీంతో శరీరం బలహీనంగా మారుతుంది. ఇది అలసట, చేతులు చల్లబడటం, కాళ్లలో జలదరింపు, తిమ్మిర్లు, ఎముకలలో నొప్పిని కలిగిస్తుంది. కొన్ని విటమిన్లు, ఖనిజాల లోపాలు మహిళల ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం కలిగిస్తాయి. రక్తహీనత, బోలు ఎముకల వ్యాధి, UTI ప్రమాదం పెరుగుతుంది. ఇవన్నీ కొన్ని పోషకాల లోపానికి దారితీస్తాయి.

ఐరన్, కాల్షియం, అయోడిన్, మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ బి12 లోపం మహిళల ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. దీన్ని తగ్గించుకోవాలంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మహిళల్లో అయోడిన్ లోపం థైరాయిడ్, గర్భస్రావం, ప్రసవం, నెలలు నిండకుండానే ప్రసవానికి దారితీస్తుంది. దీని నుంచి బయటపడాలంటే ఉప్పు, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే, రోజూ నిమ్మకాయను కూడా వాడాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ జ్యూస్ తాగొచ్చు.

ఇవి కూడా చదవండి

మహిళల్లో రక్తహీనత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపం కారణంగా వేగంగా అలిసిపోవటం, శ్వాస ఆడకపోవుట, మైకము కలిగిస్తుంది. దీనిని నివారించడానికి, దానిమ్మ, గింజలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినండి. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.  అలాగే, మెగ్నీషియం లోపాన్ని తగ్గించుకోవడానికి గుమ్మడి గింజలు, బాదం, బచ్చలికూర, జీడిపప్పు, వేరుశెనగలను తినండి. ఫోలేట్, విటమిన్ బి12 లోపాన్ని నివారించడానికి ఆకుకూరలు, చిక్కుళ్ళు, పొద్దుతిరుగుడు విత్తనాలు, తృణధాన్యాలు, తాజా పండ్లను తినండి.

వీటన్నింటితో పాటు.. ఒత్తిడిని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయటం అలవాటుగా చేసుకోవాలి.. ఇది కాకుండా డ్యాన్స్ కూడా చేయొచ్చు. వాకింగ్, ఇతర వ్యాయామాలు కూడా చేయొచ్చు. ఇవి మీ ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..