Andhra Pradesh: అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు బీభత్సం..! బీచ్ రోడ్డులో ఫుట్‌పాత్ మీదకు దూసుకెళ్లిన బస్సు..
28 సర్వీస్ నెంబర్ గల ఆర్టీసీ బస్సు.. ఆర్కే బీచ్ నుంచి సింహాచలం వెళ్లాల్సి ఉంది. ఆర్కే బీచ్ నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు.. ఒక్కసారిగా అదుపుతప్పింది. కొద్ది దూరం వెళ్ళాక ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. భారీ శబ్దంతో సోలార్ పోల్స్, పార్కింగ్ బైక్ ల పైకి దూసుకెళ్లింది. దాదాపు 50 మీటర్ల వరకు బీభత్సం సృష్టించింది. దింతో స్కూటీ, బైక్ బస్సు కింద నలిగిపోయాయి. ఆ టూ వీలర్లతోపాటు సోలార్ పోల్స్, బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బస్సులో ఉన్న
– ఆదివారం కావడంతో విశాఖ ఆర్కే బీచ్ కు భారీ ఎత్తున సందర్శకులు చేరుకున్నారు. బీచ్ కు రద్దీ పెరిగింది. పర్యాటకులతో ఆర్కే బీచ్ కలకళలాడుతోంది. ఈ సమయంలో గోకుల్ పార్క్ వద్ద భారీ శబ్దం. వచ్చి చూసేసరికి.. ఆర్టీసీ బస్సు ముందు అద్దాలు పగిలి ఉన్నాయి. బస్సు కింద ఓ బైకు నలిగిపోయింది. ఫుట్ పాత్ పై ఉన్న సోలార్ పోల్స్ ధ్వంసం అయ్యాయి. అయ్యో భారీ ప్రమాదమే జరిగి ఉంటుందని అక్కడ దృశ్యాలు చేసి అంతా గుండెలు పట్టుకున్నారు. అదృష్టవశాత్తు భారీ ప్రమాదం ముప్పు తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అదే ప్రమాదం ఆర్కే బీచ్ వద్ద జరిగి ఉంటే.. తీవ్రత చెప్పలేనంతగా ఉండేది.
– విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. 28 సర్వీస్ నెంబర్ గల ఆర్టీసీ బస్సు.. ఆర్కే బీచ్ నుంచి సింహాచలం వెళ్లాల్సి ఉంది. ఆర్కే బీచ్ నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు.. ఒక్కసారిగా అదుపుతప్పింది. కొద్ది దూరం వెళ్ళాక ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. భారీ శబ్దంతో సోలార్ పోల్స్, పార్కింగ్ బైక్ ల పైకి దూసుకెళ్లింది. దాదాపు 50 మీటర్ల వరకు బీభత్సం సృష్టించింది. దింతో స్కూటీ, బైక్ బస్సు కింద నలిగిపోయాయి. ఆ టూ వీలర్లతోపాటు సోలార్ పోల్స్, బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బస్సులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
తప్పిన పెను ప్రమాదం..
ఆదివారం కావడంతో బీచ్కు భారీ స్థాయిలో సందర్శకులు వస్తుంటారు. అయితే ప్రమాదం జరిగిన గోకుల్ పార్క్ ఏరియాలో.. సందర్శకులు బీచ్ వైపు ఉన్నారు . వాహనాలను రోడ్డుపై పెట్టి సముద్రం వైపు వెళ్లారు. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ప్రమాదా దృశ్యాలు చూసినవాళ్లంతా.. అమ్మో అనుకున్నారు. మరోవైపు భారీ శబ్దంతో ప్రమాదం జరగడంతో తీరం వైపు ఉన్నవాళ్లు రోడ్డుపైకి వచ్చి చూసేసరికి అప్పటికే బైక్స్ ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికి భారీ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సందర్శకులుగానే ఉండి ఉంటే భారీ నష్టమే జరిగి ఉండేదని అంటున్నారు స్థానికులు. ఘటన కలిగి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సు ఫుట్ పాత్ పైకి ఎలా ఎక్కింది అన్నదానిపై ఆలోచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..