AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ముఖం హీరోయిన్‌లా మెరిసిపోవాలనుకుంటున్నారా? ఐతే ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి..!!

ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా, ఫ్యాటీ యాసిడ్స్, లాక్టిక్ యాసిడ్ చర్మానికి రక్షణనిస్తుంది. అలాగే.. మీ చర్మంపై పేరుకుపోయిన ట్యాన్‌ను తొలగించి చర్మాన్ని శుద్ధి చేయటానికి పెరుగును ఉపయోగించవచ్చు. కాబట్టి, పెరుగుతో వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

మీ ముఖం హీరోయిన్‌లా మెరిసిపోవాలనుకుంటున్నారా? ఐతే ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి..!!
Curd Face Mask
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 27, 2023 | 2:15 PM

ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం మార్కెట్లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే, చాలా మంది మార్కెట్లో కొనుగోలు చేసిన వాటి కంటే ఇంట్లో లభించే కొన్ని రకాల వస్తువులతో అందంగా మారొచ్చని చెబుతుంటారు. అలాంటి హోం రెమిడీస్‌ని ప్రయత్నించమని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించరు. కాబట్టి ఈ రోజు మనం పెరుగు చర్మాన్ని మెరుగుపరచడంలో ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం..మీ చర్మం కాంతివంతంగా, అందంగా ఉండటానికి పెరుగుతో ఈ ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి.

ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా, ఫ్యాటీ యాసిడ్స్, లాక్టిక్ యాసిడ్ చర్మానికి రక్షణనిస్తుంది. అలాగే.. మీ చర్మంపై పేరుకుపోయిన ట్యాన్‌ను తొలగించి చర్మాన్ని శుద్ధి చేయటానికి పెరుగును ఉపయోగించవచ్చు. కాబట్టి, పెరుగుతో వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

పెరుగు, తేనె ఫేస్ ప్యాక్:

ఇవి కూడా చదవండి

పెరుగు చర్మానికి ఎంత మేలు చేస్తుందో, తేనె కూడా చర్మానికి అంతే మేలు చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని మీ చర్మసౌందర్యానికి తేనెను కూడా ఉపయోగించవచ్చు. పెరుగు, తేనెతో కలిపి ఫేస్‌ ప్యాక్‌ ఎలా తయారు చేసుకొవాలి, ఎలా ఉపయోగించాలంటే.. ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్ల పెరుగును తీసుకోవాలి. అందులో తేనె కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్‌ చేసి… ఆ తర్వాత మీ ముఖానికి అప్లై చేయాలి. సుమారు 30 నిమిషాల పాటు ముఖానికి ప్యాక్‌ అలాగే వదిలేయాలి. తర్వాత నీళ్లతో శుభ్రంగా ముఖం కడుక్కోవాలి.

పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్:

మీ చర్మం టానింగ్ సమస్యతో బాధపడుతుంటే, దానివల్ల ఫేస్‌ గ్లో పూర్తిగా మాయమైపోతుంది. దీని కోసం మీరు పెరుగుతో పసుపును కలిపి ఉపయోగించుకోవచ్చు. ఇది మీ చర్మం నుండి టాన్‌ను తొలగిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

దీని కోసం ఒక గిన్నెలో 2 స్పూన్ల పెరుగు తీసుకోండి. తర్వాత అందులో 1/2 టీస్పూన్ పసుపు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి. సుమారు 30 నిమిషాల పాటు ముఖం మీద అలాగే ఆరిపోనియాలి.. ఆ తర్వాత నీటితో కడగాలి. దీన్ని ఉపయోగించిన తర్వాత మీ ముఖానికి సబ్బును ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. అలాగే, ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు ఉపయోగించండి.

పెరుగు ప్రయోజనాలు:

పెరుగులో విటమిన్ డి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇది చర్మానికి పోషకాలను అందిస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం డల్ స్కిన్‌ను తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..