Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: పొద్దున్నే వంటగదిలో ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకోండి.. గృహిణిలకు అద్భుతమైన ఐడియా

Save Time In Kitchen: టెన్షన్ లేకుండా అంతా ఎవరి పనిలోకి వారు వెళ్లాలంటే గృహిణి ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే ఉద్యోగాలకు, వ్యాపారాలకు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే కుటుంబ సభ్యులకు సమయానికి అందించడం సాధ్యమవుతుంది. ఇదంతా గందరగోళంగా కాకుండా ప్రశాంతంగా పూర్తి చేయాలి. అది ఎలా అని ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు యూట్యూబ్‌లో వెతుకుతున్నారు. అంతగా కష్టపడకుండానే మేము మీ కోసం కొన్ని చిట్కాలను తీసుకొచ్చాం. అవేంటో ఇక్కసారి చదవండి చాలు..

Kitchen Hacks: పొద్దున్నే వంటగదిలో ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకోండి.. గృహిణిలకు అద్భుతమైన ఐడియా
Dining Table
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 27, 2023 | 6:11 PM

విజయవంతమైన పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది మనందరికీ తెలుసు. కానీ, దీనిని నిజం చేయడం అనేది ఆ గృహిణి చేతిలో ఉంటుంది. ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక గృహిణి ఉంటుంది. అవును, గృహిణి లేని మీ జీవితాన్ని నిజంగా ఊహించగలరా? ఎవరూ విజయవంతంగా పుట్టరు. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఏదో ఒక సమయంలో గృహిణి అవసరం. గృహిణి అంటే ఏంటి? సరే, ప్రతి ఒక్కరికీ దీని గురించి వారి స్వంత అభిప్రాయం ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు కిచెన్‌లో కుస్తీ పడుతుంటారు. ఉదయం మొదలు రాత్రి వరకు అస్సలు అలిసి పోకుండా ఎన్నో పనులతో విజయవంతంగా ఇంటిని తీర్చి దిద్దుతుంటారు.

అయితే కాలం మారుతోంది.. కేవంలం కిచెన్‌కు మాత్రమే పరిమితం కాకుండా రెండు చేతుల సంపాదిస్తూ.. కుటుంబాన్ని తీర్చిదిద్దే పనిలో కూడా వారు తెగ బిజీగా గడుపుతుంటారు. అలుపు-సొలుపు అనే పదాలను దగ్గరకు రానీయకుండా ముందుకు దూసుకుపోతుంటారు. అయితే ఉదయం కిచెన్‌లో కష్టపడి పనిచేసి సరైన సమయానికి టిఫిన్ తయారు చేయలేకపోతుంటారు..

అల్పాహారం ఆలస్యమైన సమయంలో మీకు మంచి ప్లాన్ అవసరం. మీ సమయాన్ని ఆదా చేయడంలో ముందస్తు ప్రణాళిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం లేవడానికి ముందు రాత్రి అల్పాహారం, టిఫిన్ కోసం మీరు కొన్ని సన్నాహాలు చేస్తే, ఉదయం సమయం తక్కువ పడుతుంది. మీరు ఆందోళన చెందుతుంటారు. ఉదయం సమయాన్ని ఆదా చేయడానికి మీరు ఏం చేయవచ్చో ఇక్కడ మేము తెలియజేస్తున్నాము.

పాత్రలను సిద్ధంగా ఉంచుకోండి..

మీరు రాత్రిపూట సరైన స్థలంలో పాత్రలను శుభ్రం చేసి ఉంచినట్లయితే.. మీరు ఉదయం పని చేయడం సులభం అవుతుంది. మీకు ఏ పాత్ర అవసరం అవుతుందో ముందే నిర్ణయించుకోండి. ఉపయోగించిన పాత్రలను వెంటనే సింకులో వేయండి.

కూరగాయలు కట్ చేసి పెట్టండి..

రాత్రిపూట కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోండి. కూరగాయలను కట్ చేసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే ఉదయం చాలా సమయం ఆదా అవుతుంది. తక్కువ సమయంలో ఆహారం వండుకోవచ్చు. కావాలంటే కూరగాయలను కోసి ఫ్రిజ్ లో భద్రపరుచుకుని ఉదయం పూట మాత్రమే వాడుకోవచ్చు. లేదా ఓ తడి గుడ్డలో వాటిని చుట్టి బయట పెట్టుకోండి.

బంగాళదుంపలను..

మీకు ఉదయం తక్కువ సమయం ఉంటుంది.. రాత్రి బంగాళదుంపలను ఉడికించి ఫ్రిజ్‌లో ఉంచండి. ఉదయాన్నే ఈ బంగాళదుంపలను స్మాష్ చేసుకుని పెట్టుకోండి. నేరుగా వాటిని కుర్మా చేయడానికి చపాతీ, పూరీ చేస్తే  పరాటాలు లేదా కూరగాయలు మొదలైనవి చేయండి. ఇది రుచిని కూడా పెంచుతుంది. సిద్ధం చేయడానికి తక్కువ సమయం పడుతుంది.

మెనుని సిద్ధం చేసుకోండి..

మీరు రాత్రిపూట మీ కుటుంబ సభ్యులతో చర్చించి ఉదయం, టిఫిన్ కోసం మెనూని సిద్ధం చేయాలి. ఈ విధంగా, మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ మనస్సును నిమగ్నం చేయవలసిన అవసరం ఉండదు. మీరు అన్ని పనులను సజావుగా పూర్తి చేయగలుగుతారు.

టేబుల్‌ను సిద్ధంగా ఉంచండి

ఉదయం మనం చాలా బీజీగా మారిపోతాం. అందుకే ముందుగానే డైనింగ్ టేబుల్‌పై అన్ని సిద్దంగా పెట్టండి. ఇలా చేస్తే ఉదయం పూట సర్వ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. వస్తువులను వెతకకుండానే సర్వ్ చేయగలుగుతారు. మీరు రాత్రిపూట కూడా టిఫిన్ బాక్స్‌ను టేబుల్‌పై ఉంచవచ్చు. ఇది మీ పనిని సులభతరం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం