AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Juices to Reduce Period Pain: పీరియడ్స్ టైమ్ లో నొప్పితో బాధపడుతున్నారా.. ఈ మ్యాజికల్ జ్యూస్ లతో బైబై చెప్పండి!!

పీరియడ్స్.. లేడీస్ కి ఒక తలనొప్పి అనే చెప్పాలి. దాని వల్ల ఎంత ప్రయోజనం ఉన్నా.. అది వస్తుందంటే మాత్రం మహిళలకు టెన్షన్ మొదలవుతుంది. మరికొంత మందికి అయితే మాత్రం అది ఓ అగ్నిపరీక్షలా ఫీల్ అవుతారు. పీరియడ్స్ అందరికీ ఒకేలా ఉండవు. కొందరికి కడుపులో నొప్పి వస్తుంది, మరికొందరికి నడుం నొప్పి, వాంతులు, కడుపులో తిప్పడం, తీవ్ర రక్త స్రావం, చికాకులు ఇలా చాలా కారణాలు ఉంటాయి. మరికొంత మందికి అయితే జ్వరం కూడా వస్తూ ఉంటుంది. నెలసరి వచ్చినప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా కొందమంది మహిళలకు..

Juices to Reduce Period Pain: పీరియడ్స్ టైమ్ లో నొప్పితో బాధపడుతున్నారా.. ఈ మ్యాజికల్ జ్యూస్ లతో బైబై చెప్పండి!!
Periods Precautions
Chinni Enni
|

Updated on: Aug 27, 2023 | 8:00 PM

Share

పీరియడ్స్.. లేడీస్ కి ఒక తలనొప్పి అనే చెప్పాలి. దాని వల్ల ఎంత ప్రయోజనం ఉన్నా.. అది వస్తుందంటే మాత్రం మహిళలకు టెన్షన్ మొదలవుతుంది. మరికొంత మందికి అయితే మాత్రం అది ఓ అగ్నిపరీక్షలా ఫీల్ అవుతారు. పీరియడ్స్ అందరికీ ఒకేలా ఉండవు. కొందరికి కడుపులో నొప్పి వస్తుంది, మరికొందరికి నడుం నొప్పి, వాంతులు, కడుపులో తిప్పడం, తీవ్ర రక్త స్రావం, చికాకులు ఇలా చాలా కారణాలు ఉంటాయి. మరికొంత మందికి అయితే జ్వరం కూడా వస్తూ ఉంటుంది.

నెలసరి వచ్చినప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా కొందమంది మహిళలకు ఈ రకమైన సమస్యలు ఎదురవుతాయి. నార్మల్ గా ఉన్నప్పుడు కంటే పీరియడ్స్ టైమ్ లో మరింత కేర్ తీసుకోవాలి లేడీస్. బలమైన ఆహారం తీసుకోవాలి. అలాగే పీరియడ్స్ టైమ్ లో కొన్ని జ్యూస్ లు తాగితే.. కడుపు నొప్పి, నడుం నొప్పి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. మరి అవేంటి? వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్ రూట్ జ్యూస్:

ఇవి కూడా చదవండి

పీరియడ్స్ సమయంలో బీట్ రూట్ జ్యూస్ మంచి ఔషధంలా పని చేస్తుంది. ఇందులో అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పీరియడ్స్ సమయంలో ఈ జ్యూస్ తాగితే నొప్పి కంట్రోల్ లోకి వస్తుంది. బీట్ రూట్ లో నైట్రేట్ లు ఉంటాయి. ఇది రక్త నాళాలను సడలించడంలో సహాయపడుతుంది. ఇది గర్భాశయాన్ని రిలాక్స్ చేసి, నొప్పిని తగ్గిస్తుంది.

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్ లో ఉండే పోషకాల కారణంగా పీరియడ్స్ లో వచ్చే కడుపులో తిప్పడం, నొప్పి, తిమ్మిర్లు వంటి వాటిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఈ జ్యూస్ పెయిన్ కిల్లర్ కు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్ సి, ఇ పోషకాలు ఉంటాయి.

యాపిల్ జ్యూస్:

పీరియడ్స్ టైమ్ లో యాపిల్ జ్యూస్ కూడా బాగా పని చేస్తుంది. ఈ జ్యూస్ లోని పోషకాలు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని 70 శాతం వరకూ తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ జ్యూస్ కడుపు నొప్పి, నడుం నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది.

బొప్పాయి రసం:

పీరియడ్స్ సమయంలో వచ్చే అసౌకర్యం, కడుపు నొప్పి వంటి వాటిని బొప్పాయి రసం తాగడం ద్వారా దూరం చేసుకోవచ్చు. బొప్పాయిలో మినరల్స్, విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇది న్యాచురల్ గానే నొప్పి నివారిణిగా పని చేస్తుంది.

పైనాపిల్ జ్యూస్:

నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందుల నుంచి పైనాపిల్ జ్యూస్ ఉపశమనం ఇస్తుంది. గర్భాశయ లైనింగ్ సంకోచాల కారణంగా పిరియడ్స్ సమయంలో నొప్పి వస్తుంది. ఆ సమయంలో ఈ జ్యూస్ తాగడం వల్ల గర్భాశయం రిలాక్స్ అవుతుంది. దీంతో నొప్పి తగ్గుతుంది. పైనాపిల్ జ్యూస్ లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి