Viral Video: వార్నీ ఇదేందయ్యా ఇది.. మెట్రో అయిపోయింది.. ఇప్పుడు బస్సులో మహిళల డిష్యూం..డిష్యూం…!

ఆంటీల ఫైటింగ్‌ మామూలుగా లేదు.. కుస్తీ పోటీలను మించిపోయి కనిపిస్తుంది. ఒకే సీటులో పోటీపడుతూ కూర్చున్న ఆ ఇద్దరు మహిళలు సిగలు పట్టుకుని మరీ వాయించేసుకుంటున్నారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదాన్ని కొందరు ప్రయాణికులంతా తమాషాగా చూస్తుంటే, మరికొందరు వారిని వారించే ప్రయత్నం కూడా చేశారు.

Viral Video: వార్నీ ఇదేందయ్యా ఇది.. మెట్రో అయిపోయింది.. ఇప్పుడు బస్సులో మహిళల డిష్యూం..డిష్యూం...!
Women Fight
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 26, 2023 | 10:13 PM

ఢిల్లీ మెట్రో అంటే ఇప్పుడు బిగ్‌బాస్‌ను మించిన ఎంటర్‌టైన్మెంట్‌ అని చెప్పాలి. ఎందుకంటే.. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలుస్తుంటాయి. నిబంధనలకు విరుద్ధంగా మెట్రో స్టేషన్‎లో డ్యాన్స్ చేయడం, వింత స్టంట్స్‌తో రీల్స్ చేయడం, తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారనే ఆలోచన ఏ మాత్రం లేకుండా కొందరు తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మెట్రో సిబ్బంది, అధికారులు ఎంత కట్టడి చేసినా కంటెట్ క్రియేటర్లు మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. ఇదిలా ఉంటే, ఇక మెట్రోలో సాధారణ ప్రజలు చేసే చిత్ర విచిత్రమైన పనులు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మెట్రోలో మహిళల సిగపట్లు, యువతి యువకుల వాగ్వాదం, సీటు కోసం కుస్తీలు పడటం వంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే, ఈ సారి మెట్రో కాదు.. DTC కి చెందిన ఓ బస్సులో మహిళల డిష్యూం. డిష్యూం ఇది.

మహిళ సిగపట్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్‌ మీడియాలో చూశాం మనం. అయితే, ఆశ్చర్యకరంగా ఈసారి DTC బస్సులో ఇద్దరు మహిళా ప్రయాణీకుల మధ్య జరిగిన సిగపట్లకు సంబంధించిన వీడియో ఇది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. వేల సంఖ్యలో నెటిజన్ల లైకులు, కామెంట్లను సంపాధించింది. అంతేకాదు.. బహిరంగ చర్చలకు దారితీసింది. సీటు కోసం పోటీపడుతున్న ఇద్దరు మహిళల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదాన్ని వీడియో క్లిప్ క్యాప్చర్ చేశారు కొందరు తోటి ప్రయాణికులు. అదే వీడియోని ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేయగా ఇప్పుడా వీడియో వైరల్‌ అవుతోంది.

వైరల్‌ వీడియో ఆధారంగా ఇది DTCకి చెందిన బస్సుగా తెలిసింది. సీటు కోసం ఇద్దరు మహిళలు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఆంటీల ఫైటింగ్‌ మామూలుగా లేదు.. కుస్తీ పోటీలను మించిపోయి కనిపిస్తుంది. ఒకే సీటులో పోటీపడుతూ కూర్చున్న ఆ ఇద్దరు మహిళలు సిగలు పట్టుకుని మరీ వాయించేసుకుంటున్నారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదాన్ని కొందరు ప్రయాణికులంతా తమాషాగా చూస్తుంటే, మరికొందరు వారిని వారించే ప్రయత్నం కూడా చేశారు.

అయితే, ఈ వీడియోలోని సంఘటన ఎప్పుడు జరిగింది అనే విషయం మాత్రం తెలియదు గానీ, తేదీ లేని వీడియో X (గతంలో ట్విట్టర్)లో @gharkekalesh అనే హ్యాండిల్ ద్వారా షేర్‌ చేయబడింది. సీటు కోసం ఢిల్లీ ప్రభుత్వ బస్సులో మహిళల సిగపట్లు అనే శీర్షికతో షేర్ చేయబడింది. ఒక ప్రయాణికుడు చిత్రీకరించిన వీడియో క్లిప్ సోషల్‌ మీడియా యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. కానీ చివరకు మహిళలు ఇద్దరూ ఎంతసేపటికీ గొడవ ఆపలేదు.

ఈ వైరల్‌ వీడియోని షేర్ చేసినప్పటి నుండి 44,000 వీక్షణలు, 300 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. క్లిప్ వినియోగదారులను వారి ఆలోచనలను కూడా షేర్‌ చేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ఇలాంటి చర్యలు ఏ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో జరగకూడదని పేర్కొన్నారు. మరికొందరు ఈ సంఘటనపై జోక్‌లు పేల్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో