చంద్రయాన్ – 3 లో కీలకంగా వ్యవహరించిన ఐదుగురు విశాఖ శాస్త్రవేత్తలు.. ఇవి వారి పూర్తి వివరాలు..

ఇలా అత్యంత ఉత్కంఠ రేపు అద్వితీయ విజయం సాధించిన చంద్రయాన్ - 3 ప్రయోగం పాలుపంచుకున్న వారందరినీ స్వయంగా కలిసి ప్రధాని అభినందనలు తెలిపారు. వారిలో మన విశాఖ వాసులు ఉండడం పట్ల అందరిలోనూ ఆనందం నింపింది.

చంద్రయాన్ - 3 లో కీలకంగా వ్యవహరించిన ఐదుగురు విశాఖ శాస్త్రవేత్తలు.. ఇవి వారి పూర్తి వివరాలు..
Visakha scientists
Follow us
Eswar Chennupalli

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 26, 2023 | 9:38 PM

చంద్రయాన్ – 3 విజయం ప్రపంచాన్ని అంతా అబ్బుర పరిస్తే విశాఖ ను మాత్రం ప్రత్యేక ఆనందోత్సాహాల్లో ముంచేసింది. భారతావనిని పులకరింపచేసిన ఈ అద్భుత విజయం వెనుక ఐడుమంది ఉమ్మడి విశాఖ జిల్లా కు చెందిన శాస్త్రవేత్తలు ఉండడం తో సాగర తీరం సంతసంతో చేసిన సవ్వడి అంతా ఇంతా కాదు. అమేయమైన భారత్ శక్తిని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన చంద్రయాన్-3 విజయం లో ఉమ్మడి విశాఖకు చెందిన ఐదుగురు శాస్త్రవేత్తలు పాలు పంచుకున్నారు. ఏకంగా మిషన్ డైరెక్టర్ నుంచి రోవర్ లో ఉపయోగించిన రోబోటిక్ పరికరాల తయారీ వరకు అత్యంత కీలకమైన స్థానాల్లో పనిచేసిన వారిని పరిచయం చేయడమే ఈ కథనం ఉద్దేశం.

– చంద్రయాన్ -3 మిషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ మోటమర్రి శ్రీకాంత్

స్వస్థలం విజయనగరం జిల్లా సాలూరు. తండ్రి ఉద్యోగం, కుటుంబ అవసరాల రీత్యా మచిలీపట్నం వరకు పదో తరగతి, అక్కడే హిందూ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదివాక ఫ్యామిలీ విశాఖకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. తర్వాత డిగ్రీ రెండేళ్లు విశాఖలోని ఏవీఎన్ కళాశాలలో చదివారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేశారు. తర్వాత ఇండోర్ లో ఎంటెక్ పూర్తి చేసి ఇస్రోలో సైంటిస్ట్ గా చేరారు. ఇస్రో లో సైంటిస్ట్ గా స్థిరపడిపోవడం, అక్కడే ఉద్యోగ రీత్యా పదోన్నతులు లభించడం తి శ్రీకాంత్ బెంగళూరులో నే స్థిరపడ్డారు.

ఇవి కూడా చదవండి

శ్రీకాంత్ ఇరవై ఏళ్లుగా ఇస్రోలో వివిధ పోజిషన్స్ ల్లో పని చేశారు. అంతకు ముందు మార్స్ మిషన్ కు ఆపరేషన్ డైరెక్టర్ గా చేశారు. తర్వాత చంద్రయాన్-2కు డిప్యూటీ మిషన్ డైరెక్టర్ కూడా శ్రీకాంత్ నే. అనంతరం నాలుగేళ్లు గా మిషన్ ఆపరేషన్స్ డైరక్టర్ గా చంద్రయాన్ -3 కి పనిచేసిన కీలకమైన శాస్త్రవేత్తగా నేరుగా ప్రధాని చేత ప్రశంసలు అందుకున్న సైంటిస్ట్ గా మనందరికీ గర్వకారణంగా నిలిచారు.

– డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ విభాగ శాస్త్రవేత్త రామచంద్ర

ఉమ్మడి విశాఖ జిల్లా కొత్తకోటకు చెందిన అడ్డూరి రామచంద్ర చంద్రయాన్ -3 విజయం లో కీలక పాత్ర వహించిన మరో శాస్త్రవేత్త. చంద్రయాన్ మిషన్ లో ల్యాండర్ లో అత్యంత కీలకమైన పేలోడ్స్, డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ కూర్పు లో రామచంద్ర దే ప్రధాన పాత్ర. కొత్తకోట కు చెందిన రైతు అడ్డూరి నారాయణరావు కుమారుడు రామచంద్ర. ఆయన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కొత్తకోటలోనే సాగింది. టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాక బొబ్బిలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో, అనంతరం అక్కడే బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత విద్యపై మక్కువతో చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఎంటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చేసి అక్కడనుంచే అంతరిక్ష పరిశోధన కేంద్రం లో రీసెర్చ్ కోసం చేరి అక్కడే పనిచేస్తున్నారు.

–  ఇస్రోలో యంగ్ సైంటిస్ట్ రవీంద్ర

చంద్రయాన్-3 ప్రయోగంలో ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం యువశాస్త్రవేత్త కె . రవీంద్ర దీ ప్రధాన పాత్ర నే. ల్యాండర్ రూపకల్పన, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దడం లో ఏర్పాటైన టీమ్ లో రవీంద్ర సభ్యుడు. అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన రిటైర్డ్ టీచర్ కుమారుడైన కె.రవీంద్ర ఇస్రోలో ఐదేళ్లుగా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.

–  గ్రేడ్ – సీ సైంటిస్ట్ గా చోడవరం మండలంకి చెందిన కొమ్మనమంచి భరద్వాజ్

చంద్రయాన్-3 విజయం లో సైంటిస్ట్ ల బృందం లో చోడవరం మండలం గవరవరం గ్రామానికి చెందిన కొమ్మనమంచి భరద్వాజ్ ఒకరు. 2021 డిసెంబరులో గ్రేడ్ సీ శాస్త్రవేత్తగా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో భరద్వాజ్ చేరారు. కొమ్మనమంచి భరద్వాజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చోడవరం విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ లో జరిగింది. భరద్వాజ్ తండ్రి వెంకటరావు న్యాయవాది.

–  రాకెట్ సైన్స్ సైంటిస్ట్ ఎస్. స్టీఫెన్ ది షీలానగర్ 

విశాఖ నగరం, షీలా నగర్ కు చెందిన ఎస్. స్టీఫెన్ రాకెట్ సైన్స్ ఇంజినీర్. మూన్ ల్యాండర్ టీమ్ లో సభ్యులు. ఉపాధ్యాయులైన భాస్కర్, శాంతిభాస్కర్ దంపతుల కుమారుడు.

ఇలా అత్యంత ఉత్కంఠ రేపు అద్వితీయ విజయం సాధించిన చంద్రయాన్ – 3 ప్రయోగం పాలుపంచుకున్న వారందరినీ స్వయంగా కలిసి ప్రధాని అభినందనలు తెలిపారు. వారిలో మన విశాఖ వాసులు ఉండడం పట్ల అందరిలోనూ ఆనందం నింపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!