Health Tips: ఉదయం బ్రష్ చేయకుండానే నీళ్లు తాగే అలవాటు మీకుందా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

మీరు తగినంత నీరు తాగనప్పుడు నోరు పొడిబారడం సమస్య వస్తుంది. కాబట్టి మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత తప్పనిసరిగా నీరు తాగాలి. ఉదయాన్నే తగినంత నీటిని తాగడం వల్ల రోజంతా హైడ్రెట్‌గా ఉండొచ్చు. ఉదయం పూట పాచి నోటితో నీటిని తాగడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Health Tips: ఉదయం బ్రష్ చేయకుండానే నీళ్లు తాగే అలవాటు మీకుందా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Drinking Water Without Brus
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 26, 2023 | 8:09 PM

శరీరానికి నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అనేక కడుపు సంబంధిత వ్యాధులకు, మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి నీరు చాలా ముఖ్యమైనది. వైద్యులు చెబుతున్న దాని ప్రకారం ప్రతి రోజు 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. కానీ చాలా మంది ఉదయం బ్రష్ చేయడానికి ముందు పాచి నోటితోనే నీళ్లు తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందా…? లేక ఆరోగ్యానికి హని కలిగిస్తుందా..? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం…

బ్రష్ చేయడానికి ముందు మీరు పాచి నోటితో నీళ్లు తాగటం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. శరీరంలో బద్ధకం, మొటిమలు, కడుపు జబ్బులు, అజీర్ణం సమస్య ఇలా ఎన్నో రోగాలు నయమవుతాయి. ఉదయాన్నే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నిద్రలో అంటే 7-8 గంటల మధ్య మనం నీళ్లు తాగము. అందువల్ల మీరు ఉదయం నిద్రలేవగానే ముందుగా నీళ్లు తాగాలి. తద్వారా మీ శరీరం మొదట హైడ్రేట్ గా ఉంటుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటివి దరి చేరకుండా ఉంటుంది. దీంతో జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం పూట పాచి నోటితోనే నీటిని తాగడం వల్ల హైబీపీ, మధుమేహం వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అలాగే ఉదయం పూట నీళ్లు తాగితే ఊబకాయం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే, పాచి నోటితోనే నీటిని తాగండి. ఇలా చేయటం వల్ల నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోదు. నోటిలో గడ్డకట్టిన సూక్ష్మక్రిములన్నీ నీటిని తాగడం వల్ల నోట్లో క్రిములు లేకుండా పోతాయి.

ఇవి కూడా చదవండి

గంటల తరబడి నోరు పొడిబారడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. అలాంటప్పుడు ఉదయాన్నే నిద్రలేచి పాచి నోటితో నీటిని తాగితే అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీరు తగినంత నీరు తాగనప్పుడు నోరు పొడిబారడం సమస్య వస్తుంది. కాబట్టి మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత తప్పనిసరిగా నీరు తాగాలి. ఉదయాన్నే తగినంత నీటిని తాగడం వల్ల రోజంతా హైడ్రెట్‌గా ఉండొచ్చు. ఉదయం పూట పాచి నోటితో నీటిని తాగడం వల్ల హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉండవచ్చు. అలాగే ఉదయం పూట నీళ్లు తాగితే ఊబకాయం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా పాచి నోటితో నీటిని తాగండి. ఉదయం పూట పాచి నోటితో నీటిని తాగడం మంచిదని తెలుస్తోంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..