AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మెట్రోనా మజాకా..? జర్నీ మాత్రమే కాదు.. పూటకో సినిమా చూడొచ్చు..! ఇద్దరు యువతులతో ఓ కుర్రాడు..

సోషల్ మీడియాలో వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 19 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. చాలా మంది నెటిజన్లు వీడియోపై తమ స్పందన తెలియజేశారు. లేడీస్ కంపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిదే గాక, పైగా ఆ యువకుడు చేసిన పనికి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Viral Video: మెట్రోనా మజాకా..? జర్నీ మాత్రమే కాదు.. పూటకో సినిమా చూడొచ్చు..! ఇద్దరు యువతులతో ఓ కుర్రాడు..
Delhi Metro
Jyothi Gadda
|

Updated on: Aug 26, 2023 | 5:48 PM

Share

మెట్రోనా మజాకా..! నిజంగానే మెట్రో జర్నీ అంటే పూటకో సినిమా చూడొచ్చు అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే.. ఇటీవల తరచూగా ఏదో ఒక వీడియో మెట్రోకు సంబందించి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ వస్తోంది. రద్దీగా ఉండే మెట్రోరైల్లో కేవలం జర్నీ మాత్రమే కాదు.. ప్రేమికుల రొమాన్స్, మహిళ సీటుకోసం ఫైటింగ్, అమ్మాయిల హడావుడి రెడీ అయ్యే సంఘటనలు కూడా చూశాం.. ఇంకా కొందరు బట్టలు ఆరబెట్టుకోవటం, కొందరు చిత్ర విచిత్ర స్టంట్లు చేయటం వంటివి చాలానే చూశాం. ఇక ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే…ఇలాంటి అనేక వింత సంఘటనలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఢిల్లీ మెట్రో. సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రోకు సంబంధించి ఇప్పటికే కొన్ని వందల వీడియోలు వైరల్‌గా మారాయి. అందులో కొన్ని వీడియోలు చూసిన మెట్రో సిబ్బంది చర్యలు తీసుకున్న సంఘటనలు కూడా జరిగాయి. అయితే, తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Priya singh అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా, ఇప్పుడీ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు లేడీస్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నాడు. పైగా అక్కడ అమ్మాయిలతో వాగ్వాదానికి దిగాడు. వారి గొడవను ఆపేందుకు మరో మహిళ ప్రయాణికురాలు మధ్యలోకి వచ్చింది. ఆ తర్వాత ఏంజరిగిందో వైరల్‌ వీడియోలో కనిపించింది.

వీడియోలో ఓపెనింగ్‌లో మెట్రోలో ఓ యువతి కనిపిస్తుంది… అంతలోనే ఓ యువకుడు ఆమె ఉన్న కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు. కూర్చున్న అమ్మాయి వైపు వస్తూ వస్తూనే ఆమెతో గొడవకు దిగాడు. అయితే, ఈ ఇద్దరిలో ఎవ్వరూ వెనక్కి తగ్గటం లేదు.. నువ్వేంత అంటే నువ్వేంత అన్నట్టుగా వాదించుకున్నారు. వారి వాదన ఎంతకీ తగ్గకపోవడంతో మెట్రోలో ఉన్న మరో మహిళ వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నించింది. కానీ, వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. వాదన ఏమాత్రం తగ్గించటం లేదు..దీంతో మెట్రోలో ప్రయాణిస్తున్న మరో యువతి కూడా ఆ అబ్బాయితో వాదనకు దిగింది. అతడికి వ్యతిరేకంగా మాట్లాడింది. చివరకు ఆ అమ్మాయితో కూడా మాటల దాడికి దిగాడు ఆ యువకుడు. ఎందుకు గొడవపడ్డారు.. వీరి పంచాయతీ ఏంటో మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు.. కానీ, వాగ్వాదం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగింది. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 19 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. చాలా మంది నెటిజన్లు వీడియోపై తమ స్పందన తెలియజేశారు. అమ్మాయిలతో గొడవపడుతున్న కుర్రాడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..