Hyderabad: ఇదేక్కడి చోద్యంరా సామీ..! పిల్లులకు పోస్టుమార్టం చేయాలంటూ ఒకరు.. నా మేకపిల్లను కిడ్నాప్ చేశారంటూ మరోకరు..
Hyderabad: ఇలా మనుషులే కాదు మూగ జీవుల పై కూడా మిస్సింగ్ కేసులు పెట్టేందుకు బాధితులు పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతున్నారు...కాస్త కొత్త గా ఉన్నా అవి కూడా ప్రాణులే అని సానుకూలంగా స్పందిస్తునారు పోలీసులు. పెంపుడు జంతువులకు సంబంధించిన ఈ రెండు ఘటనలు స్థానికులతో పాటు పోలీసులను కూడా షాక్ అయ్యేలా చేస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే...
హైదరాబాద్, ఆగస్టు 26: హైదరాబాద్ లో జరిగిన రెండు వేర్వేరు వింత సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పెంపుడు జంతువులకు సంబంధించిన ఈ రెండు ఘటనలు స్థానికులతో పాటు పోలీసులను కూడా షాక్ అయ్యేలా చేస్తున్నాయి. అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో వింత ఘటన చోటు చేసుకుంది..సంవత్సరం పాటు తాను పెంచుకున్న మేక పిల్ల కనిపించకుండా పోయిందని ముషీరాబాద్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలు..ఆమె ఫిర్యాదు స్వీకరించిన ముషీరాబాద్ పోలీసులు మేక పిల్ల కోసం సమీపంలోని అన్ని సీసీ కెమెరాలు పరిశీలించారు. మేకపిల్ల పోయిందంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. భోలక్ పూర్ లో నివాసం ఉంటుంది. పనిమీద తాను మరో ఊరికి వెళుతూ పక్కింటి వారికి మేక పిల్లను అప్ప చెప్పి వెళ్ళింది..తిరిగి వచ్చి చూసే సరికి మేక పిల్ల లేకపోవడం తో బాధితురాలు ఆందోళన చెందింది…చుట్టూ పక్కల అంతా వెతికింది…ఎక్కడా మేక పిల్ల కనిపించకపోవడం తో చివరిగా ముషీరాబాద్ పోలిస్ స్టేషన్ కు వచ్చింది…తన మేక పిల్లను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది…
బాధితురాలీ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..బాధితురాలి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.. పార్శిగుట్ట వైపు మేక పిల్ల వెళుతున్నట్టు కనిపించింది…ఆ తరువాత అటు నుండి ఎటు వెళ్లిందో కనిపించలేదు….ఇంకా పోలీసులు మేక పిల్లకోసం గాలిస్తున్నారు.
పిల్లులకు పోస్ట్ మార్టం చేయండి..
ఇదిలా ఉంటే బోలక్‌పూర్‌లోనే మరో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పిల్లలకు పోస్టుమార్టం చేయాలంటూ గాంధీ ఆస్పత్రికి చేరాడు.. తానెంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లలు ఉన్నట్టుండి ఒకేసారి 6 పిల్లులు చనిపోయాయి. అనుమానాస్పదంగా పిల్లలు చనిపోయాయని ఆరోపిస్తూ వాటికి పోస్టుమార్టం నిర్వహించాలంటూ డాక్టర్లను కోరాడు. దీనిపై పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. తన పిల్లులని పక్కింటి వ్యక్తి హత్యచేశాడంటూ పోలీసులకు కంప్లైట్ చేశాడు. .అయితే తాను ఆ పిల్లులను హత్య చేయలేదనీ కావాలంటే పిల్లులకు పోస్ట్ మార్టం చేయాలని కోరాడు.
ఈ క్రమంలోనే చనిపోయిన పిల్లులను తీసుకుని గాంధీ హాస్పిటల్ కు వెళ్లగా పోలీస్ సర్టిఫికెట్ తీసుకురావాలని సిబ్బంది చెప్పారు…దీంతో అసలు నిజం బయట పడింది..తానే పిల్లులకు విషం ఇచ్చి చంపినట్టు యజమాని ఒప్పుకున్నాడు…ఇలా మనుషులే కాదు మూగ జీవుల పై కూడా మిస్సింగ్ కేసులు పెట్టేందుకు బాధితులు పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతున్నారు…కాస్త కొత్త గా ఉన్నా అవి కూడా ప్రాణులే అని సానుకూలంగా స్పందిస్తునారు పోలీసులు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..