Hyderabad: హైదరాబాద్‌లో యూఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్.. విద్యార్థుల అన్ని ప్రశ్నలకు సమాధానం

Hyderabad: హైదరాబాద్‌లో యూఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్.. విద్యార్థుల అన్ని ప్రశ్నలకు సమాధానం

Ram Naramaneni

|

Updated on: Aug 26, 2023 | 1:18 PM

ఎంతో కష్టపడి అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులను..తిరగు విమానంలో మళ్లీ పంపేసిన సంఘటన ఇటీవల సంచలనం సృష్టించింది. అమెరికా కలలు చెదిరిపోయిన విద్యార్థుల ఆవేదనను.. తల్లిదండ్రుల ఆందోళనను టీవీ9 మీముందుంచింది. అమెరికా వెళ్లే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. టీవీ9 తీసుకున్న చొరవకు హైదరాబాద్‌లోని యుఎస్‌ కాన్సులేట్‌ కూడా తోడయింది.

అమెరికా కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో యూఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీవీ9 వరుస కథనాలకు స్పందించి విద్యార్థుల, తల్లిదండ్రులు అనుమానాలు నివృత్తి చేయడానికి అధికారుల చర్యలు చేపట్టారు. యూఎస్ కాన్సులేట్ జనరల్ Rebecca ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 5 వేల మంది విద్యార్థులు ఈ అవేర్‌నెస్ ఫెయిర్‌ కు హాజరుకానున్నారు. ఇందులో అమెరికాకు చెందిన 40 ప్రముఖ విద్యా సంస్థలు పాల్గొంటున్నాయి. సెప్టెంబర్ 3 వరకు హైదరాబాద్ సహా 8 నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఫేక్ యూనివర్శిటీలలో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అంటోంది అమెరికా కాన్సులేట్. యునైటెడ్ స్టేట్స్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్, పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లను కోరుకునే విద్యార్థులకు ఈ ఫెయిర్ ఉపయోగపడుతుంది. యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నత విద్య అవకాశాల గురించి U.S. విశ్వవిద్యాలయ ప్రతినిధులతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తోంది TV9. ఈ యూనివర్సిటీ ఫెయిర్‌ ద్వారా..విద్యార్థులు, తల్లిదండ్రులు యునైటెడ్ స్టేట్స్‌లోని 40 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో మాట్లాడవచ్చు.

Published on: Aug 26, 2023 01:17 PM