చంద్రయాన్-3 సక్సెస్.. నేషనల్ స్పేస్ డే తేదీని ప్రకటించిన ప్రధాని మోడీ.. ఎప్పుడంటే..

చంద్రయాన్-3 సక్సెస్.. నేషనల్ స్పేస్ డే తేదీని ప్రకటించిన ప్రధాని మోడీ.. ఎప్పుడంటే..

Phani CH

|

Updated on: Aug 26, 2023 | 1:05 PM

బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో చీఫ్ సోమనాథ్‌తో సహా ఇతర శాస్త్రవేత్తలందరినీ కలుసుకున్నారు ప్రధాని! ఈ అసాధారణ విజయానికి కారకులైన శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు భావోద్వేగంతో ప్రసంగించారు. చంద్రయాన్‌ త్రీ ల్యాండింగ్‌ ప్రదేశానికి 'శివశక్తి' అని నామకరణం చేశారు. ఏ వైఫల్యమూ అంతిమం కాదన్నారు ప్రధాని మోదీ!

బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో చీఫ్ సోమనాథ్‌తో సహా ఇతర శాస్త్రవేత్తలందరినీ కలుసుకున్నారు ప్రధాని! ఈ అసాధారణ విజయానికి కారకులైన శాస్త్రవేత్తలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు భావోద్వేగంతో ప్రసంగించారు. చంద్రయాన్‌ త్రీ ల్యాండింగ్‌ ప్రదేశానికి ‘శివశక్తి’ అని నామకరణం చేశారు. ఏ వైఫల్యమూ అంతిమం కాదన్నారు ప్రధాని మోదీ! ఆగస్ట్ 23వ తేదీని ఇక నుంచి ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా ప్రకటించారు ప్రధాని! మూన్ మిషన్‌లో మహిళా శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు మోదీ! మొత్తం సృష్టికి మహిళా శక్తే ఆధారమని కీర్తించారు. ప్రాచీన ఋషుల కాలాన్ని ప్రస్తావిస్తూ.. అంతరిక్ష రహస్యాలను మన రుషులు ఏనాడో వివరించారని గుర్తుచేశారు మోదీ! ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశ వైజ్ఞానిక శక్తిని.. మన సాంకేతికతను, మన శాస్త్రీయ స్వభావాన్ని అంగీకరిస్తున్నాయన్నారు ప్రధాని! చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 దిగిన క్షణం.. ఇప్పుడు అమరత్వం చెందిందని అన్నారు. ఇస్రో అంతరిక్ష కేంద్రానికి చేరుకునే ముందు, బెంగళూరు ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు, అక్కడ జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అని నినదించారు.