కిక్కు కోసం కక్కుర్తి.. ఫుల్ బాటిల్ కోసం తల్వార్ పట్టాడు
వరంగల్ లో ఓ వ్యక్తి కిక్కుకోసం చేసిన కక్కుర్తిపని చివరకు అతన్ని కటకటాల పాలు చేసింది.. చూసిన ప్రతి ఒక్కరినీ అవక్కాయ్యేలా చేసింది..పుల్ బాటిల్ కోసం ఏకంగా తల్వార్ తో హల్ చల్ చేశాడు.. బార్ షాప్ లోకి వెళ్లి వీరంగం సృష్టించాడు.. కిక్కు మాట దేవుడెరుగు కటకటాల పాలయ్యాడు. ఈ వెరైటీ సంఘటన వరంగల్ లోని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది..
వరంగల్ లో ఓ వ్యక్తి కిక్కుకోసం చేసిన కక్కుర్తిపని చివరకు అతన్ని కటకటాల పాలు చేసింది.. చూసిన ప్రతి ఒక్కరినీ అవక్కాయ్యేలా చేసింది..పుల్ బాటిల్ కోసం ఏకంగా తల్వార్ తో హల్ చల్ చేశాడు.. బార్ షాప్ లోకి వెళ్లి వీరంగం సృష్టించాడు.. కిక్కు మాట దేవుడెరుగు కటకటాల పాలయ్యాడు. ఈ వెరైటీ సంఘటన వరంగల్ లోని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.. అఖిల బార్ షాపులోకి బార్ షాప్ లోకి తల్వార్ తో ప్రవేశించిన మధు అనేవ్యక్తి హల్ చల్ చేశాడు.. తనకు ఫుల్ బాటిల్ కావాలని డిమాండ్ చేశాడు..
తనకు ఫుల్ బాటిల్ ఇస్తావా చేస్తావా అంటూ కొంతసేపు తల్వార్ తో హల్చల్ చేశాడు..కానీ కౌంటర్ లో ఉన్న రంజిత్ అనేవ్యక్తి అతనికి ఫుల్ బాటిల్ ఇవ్వడానికి నిరాకరించాడు.. దీంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది.. ఫుల్ బాటిల్ నుండి హాఫ్ కి వచ్చాడు.. హాఫ్ నుంచి కనీసం ఒక క్వాటర్ బాటిల్ ఇవ్వని డిమాండ్ చేశాడు…కానీ క్వార్టర్ ఇవ్వడానికి కూడా కౌంటర్లో ఉన్న వ్యక్తి నిరాకరించాడు.. ఒక దశలో కౌంటర్ మీద ఉన్న హాఫ్ బాటిల్ పట్టుకొని పారివడానికి ప్రయత్నించాడు..
కౌంటర్ మీద ఉన్న బాటిల్ పట్టుకొని పరుగులు పెడుతుండగా కౌంటర్లో ఉన్నవ్యక్తి అతన్ని పట్టుకోని ఆ బాటిల్ గుంజుకున్నాడు.. తర్వాత మరోవ్యక్తి వచ్చి అతని చేతిలోని తల్వార్ తీసుకుపోయాడు..
ఫుల్ బాటిల్ నుండి పెగ్గు ప్లీజ్ అని బ్రతిమిలాడినా సదరువ్యక్తి కథ అడ్డం తిరిగి కటకటాల పాలయ్యాడు.. నిందితుడు ఇదే ప్రాంతంలో కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తుంటాడు.. అతనికి ఈ తల్వార్ ఎక్కడినుండి వచ్చిన అని పోలీసులు ఆరాతీస్తున్నారు.