Chandrayaan 3: మరో వీడియో విడుదల చేసిన ఇస్రో.. చంద్రుడిపై ప్రజ్ఞాన్ ఏం చేస్తుందో చూసేయండి..
చందమామపై దిగడమే ఆలస్యం అన్నట్లుగా ప్రజ్ఞాన్ రోవర్ తన పనిలో స్పీడ్ పెంచింది. ల్యాండర్ నుంచి చంద్రుడిపై అడుగుపెట్టిన రోవర్.. అటూ ఇటూ కలియతిరుగుతూ చంద్రుడిపై అధ్యయనం చేస్తోంది. రోవర్ కదలికకు సంబంధించి దృశ్యాలను వరుసగా సోషల్ మీడియాలో విడుదల చేస్తున్న ఇస్రో.. ఇప్పుడు మరో వీడియో విడుదల చేసింది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై నడిచిన విధానం, ఏం చేస్తుందో క్లియర్‌గా ఆ వీడియోలో కనిపిస్తోంది. సెకనుకో సెంటీమీటర్ చొప్పున ముందుకు కదులుతోంది రోవర్.

ఇస్రో విడదుల చేసిన మరో వీడియో..
23న చంద్రుడిపై విక్రమ్ ల్యాండ్ అయిన తర్వాత రోజు నుంచి చంద్రుడిపై రోవర్ కదలికలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తోంది ఇస్రో. ఈ నెల 24న రోవర్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చే వీడియో విడుదలైంది. 25న అంటే నిన్న రోవర్ బయటకు రావడానికి ముందు ల్యాండర్ ర్యాంప్ ఎలా తెరుచుకుందో ఇస్రో విడుదల చేసింది. ఇక ఇవాళ చంద్రుడిపై రోవర్ కదలికలను లోకానికి చూపించింది. ల్యాండర్ నుంచి కొంత దూరం వరకు ముందుకు వెళ్లిన రోవర్.. టర్నర్ తీసుకుంది. చంద్రుడిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇక రోవర్ కదలికకు సంబంధించిన దృశ్యాలను ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీకి చూపించారు ఇస్త్రో సైంటిస్టులు. రోవర్ కదలికలను చూసి ప్రధాని మోదీ సైతం సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజ్ఞాన్ రోవర్ కదలికలను క్లియర్‌గా చూడొచ్చు..
Chandrayaan-3 Mission: 🔍What’s new here?
Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM
— ISRO (@isro) August 26, 2023
చంద్రుడిపై జాతీయ చిహ్నం, ఇస్రో లోగోలు ముద్రిస్తూ..
చంద్రుడిపై రోవర్ తిరుగాడుతున్న దృశ్యాలు ఒక ఎత్తయితే.. భారత జాతీయ చిహ్నం, ఇస్రో లోగోలతో కూడిన రోవర్ చక్రాల ముద్రలు చంద్రుడిపై పడడం మరో ఎత్తు. రోవర్, దాని ముద్రల నమూనా ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రోవర్‌కు ఏర్పాటు చక్రాలకు ఇస్రో శాస్త్రవేత్తలు భారత జాతీయ చిహ్నం, ఇస్రో లోగోలను రూపొందించారు. చంద్రుడిపై రోవర్ కదులుతున్న క్రమంలో ఆ ముద్రలు చంద్రుడిపై పడుతున్నాయి. అందుకు సంబంధించిన విజువల్స్.. వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తూ అబ్బురపరుస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా ప్రజ్ఞాన్ రోవర్ కదలికలకు సంబంధించి వీడియోను ఇస్రో విడుదల చేయడంతో నెటిజన్లు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. వీడియోను పలుమార్లు వీక్షిస్తున్నారు. వీడియో రిలీజ్ చేసిన గంట వ్యవధిలోనే వేలల్లో వ్యూస్ రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
… … and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..