Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఓరి నీ దుంపతెగ.. 66 ఏళ్ల వృద్దుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 23 ఏళ్ల కుర్రాడు..!

లిస్తే మాత్రం ప్రేమ ఖచ్చితంగా ఎడ్డిదని అభిప్రాయంలోకి వస్తారు. అవును, ప్రేమలో మునిగితేలిన వ్యక్తికి ఏమీ అర్థం కాదని ఒక నానుడి. పీకల్లోతు ప్రేమలో ఉన్నవారు తమకు అనిపించింది మాత్రమే చేస్తారు. తన భాగస్వామి కోసం ఎంతవరకైనా వెళ్తారు. ఇందుకు నిదర్శనమైన ఘటనలు మనం ఎన్నో చూశాం. వయసు అంతర ప్రేమ వ్యవహారాల గురించి చాలానే విన్నాం. వయసులో చిన్న అమ్మాయి.. వృద్ధుడిని ప్రేమించడం, వృద్ధురాలు యువకుడిని ప్రేమించడం..

Viral News: ఓరి నీ దుంపతెగ.. 66 ఏళ్ల వృద్దుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 23 ఏళ్ల కుర్రాడు..!
Men Love
Follow us
Shiva Prajapati

| Edited By: TV9 Telugu

Updated on: Aug 11, 2023 | 6:50 PM

సాధారణంగా ప్రేమ గుడ్డిది అంటారు.. కానీ, ఇది తెలిస్తే మాత్రం ప్రేమ ఖచ్చితంగా ఎడ్డిదని అభిప్రాయంలోకి వస్తారు. అవును, ప్రేమలో మునిగితేలిన వ్యక్తికి ఏమీ అర్థం కాదని ఒక నానుడి. పీకల్లోతు ప్రేమలో ఉన్నవారు తమకు అనిపించింది మాత్రమే చేస్తారు. తన భాగస్వామి కోసం ఎంతవరకైనా వెళ్తారు. ఇందుకు నిదర్శనమైన ఘటనలు మనం ఎన్నో చూశాం. వయసు అంతర ప్రేమ వ్యవహారాల గురించి చాలానే విన్నాం. వయసులో చిన్న అమ్మాయి.. వృద్ధుడిని ప్రేమించడం, వృద్ధురాలు యువకుడిని ప్రేమించడం.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట వింత సంబంధాలు వెలుగు చూస్తూనే ఉంటాయి. తాజాగా వచ్చిన న్యూస్ మాత్రం వీటన్నింటికీ భిన్నమైనది. అలాంటి ఇలాంటి తేడా కాదు.. చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. 23 ఏళ్ల ఓ యువకుడు.. ఏకంగా తన తాత వయసున్న వృద్దుడిని ప్రేమించాడు. అంతేకాదండోయ్.. అతన్ని పెళ్లి చేసుకున్నాడు. అవును, ఆ తాత వయసు 66. 23, 66 ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత వయసుల ప్రకారం.. ఆరోన్ (29), అతని భర్త మైఖేల్ (66), ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో నివసిస్తున్నారు. ఆరోన్ న్యూయార్క్‌లో ఇంటర్న్‌షిప్ సమయంలో మైఖేల్‌ను కలిశాడు. అప్పుడు అరోన్ వయస్సు 23 సంవత్సరాలు. డేటింగ్ యాప్ గ్రైండర్ ద్వారా ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు.ఆరోన్ మాట్లాడుతూ.. మొదటి చూపులో వారు ప్రేమలో పడిపోయారట. మైఖేల్ వృద్ధుడని ఆరోన్‌కు తెలుసు. కానీ అతను మైఖేల్ ప్రేమలో మునిగిపోయాడు. కరోనా కాలంలో కూడా అతన్ని కలవడానికి న్యూయార్క్ నుండి డబ్లిన్‌కు విమానంలో వెళ్ళాడు. లాక్‌డౌన్ సమయంలో ఇద్దరూ భార్యాభర్తల మాదిరిగానే ఒకే గదిలో ఉన్నామని ఆరోన్ చెప్పుకొచ్చాడు. ఇక మైఖేల్ భర్త అయితే, అరోన్ భార్యట. కథ బహుచిత్రంగా ఉందండోయ్.

మళ్లీ పెళ్లి చేసుకున్నారు..

మిర్రర్ నివేదిక ప్రకారం.. లాక్డౌన్ ముగిసిన వెంటనే వారిద్దరూ వివాహం చేసుకున్నారని ఆరోన్ చెప్పాడు. భర్త మైఖేల్ వృద్ధుడు అయినప్పటికీ.. చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఈ విచిత్రమైన జంటను తోటి స్నేహితులు అతనిని ఎగతాళి చేసినా.. ఆరోన్ మాత్రం లెక్క చేయలేదు. మైఖేల్ నిజంగా అద్భుతమైన భాగస్వామి అంటూ ఆరోన్‌ అబ్బురపడిపోతున్నాడు.

తాత, మనవడు అంటూ ఆటపట్టించేవారు..

‘లవ్ డోంట్ జడ్జ్’ అనే ట్రూలీ టీవీ సిరీస్‌లో తన ప్రేమ జీవితాన్ని వెల్లడిస్తూ, ఆరోన్ తమ సంబంధంలో కూడా చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. అయితే ఇద్దరూ ఆ పరిస్థితిని లైట్ తీసుకున్నారు. ప్రజలు తమను తాత, మనవడు అని పిలుస్తూ.. తరచుగా అవహేళన చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ విమర్శల మధ్య జీవించడం నేర్చుకున్నానని చెప్పాడు ఆరోన్.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..