NTR Coin: 28న ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల.. రాష్ట్రపతికి లక్ష్మీ పార్వతి ఫిర్యాదు.. ఎందుకంటే..
ఎన్టీఆర్ 100 రూపాయల నాణేలను విడుదల చేసే కార్యక్రమానికి ఆహ్వానం పంపలేదని ఏపీ తెలుగు, సంస్కృతిక అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ భార్యగా నాణేల విడుదల కార్యక్రమానికి హాజరయ్యే హక్కు తనకు ఉందని లక్ష్మీపార్వతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు..
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్మారకంగా కేంద్ర సర్కార్ 100 రూపాయల నాణాన్ని ఈ నెల 28న విడుదల చేయనుంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వంద రూపాయల నాణాన్ని విడుదల చేయనున్నారు. ఈ నాణేం విడుదల కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలను పురష్కరించుకుని భారత ప్రభుత్వం ఈ నాణాన్ని ముద్రించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నాణాన్ని సోమవారం విడుదల చేయనుంది.
రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి ఫిర్యాదు
కాగా, ఎన్టీఆర్ 100 రూపాయల నాణేలను విడుదల చేసే కార్యక్రమానికి ఆహ్వానం పంపలేదని ఏపీ తెలుగు, సంస్కృతిక అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ భార్యగా నాణేల విడుదల కార్యక్రమానికి హాజరయ్యే హక్కు తనకు ఉందని లక్ష్మీపార్వతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కాగా, తనకు ఆహ్వానం రాకపోవడంపై లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. . కాగా, ఎన్టీరామారావు జనవరి 18, 1996న మరణించారు.
భారతీయ సమాజానికి నందమూరి తారక రామారావు చేసిన సేవలకు గుర్తింపుగా నందమూరి తారక రామారావు పేరు మీద 100 నాణేన్ని విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను లక్ష్మీ పార్వతి అన్నారు. నా వ్యక్తిగత అభినందనలు తెలియజేస్తున్నాను అని ఫిర్యాదు చేసిన లేఖలో ఈ విషయాన్ని తెలిపారు. సెప్టెంబర్ 11, 1993న స్వర్గీయ ఎన్‌టి రామారావును వివాహం చేసుకున్నానని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని, ఇద్దరం కలిసి ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడిపాము. 1994లో జరిగిన ఏపీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో చురుకుగా పాల్గొన్నాము. మా నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమైంది. 294 అసెంబ్లీ స్థానాలకు 226 సాధించాము. అయితే, తన పెద్ద అల్లుడు (నారా చంద్రబాబు నాయుడు) ఇతర కుటుంబ సభ్యులతో కుమ్మక్కైన కుట్ర కారణంగా అధికారాన్ని సంపాదించాడు. ఈ దురదృష్టకర పరిణామం ఎన్టీఆర్‌లో తీవ్ర మనోవేదనకు కారణమైంది అని అన్నారు.
100 నాణేన్ని విడుదల చేసే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎన్టీఆర్ మృతికి కారణమైన కుటుంబ సభ్యులనే ఇప్పుడు ఆహ్వానిస్తున్నారని ఆమె అన్నారు. ఆగస్ట్ 28, సోమవారం జరగనున్న నాణేల విడుదల కార్యక్రమానికి అతిథి జాబితాలో తన పేరును చేర్చాలని రాష్ట్రపతి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని లక్ష్మీ పార్వతి కోరారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కోసం కేంద్రం 100 నాణేన్ని ఆయన ముఖంతో ముద్రించింది. నాణెం 44 మిమీ వ్యాసం, 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిగి ఉంది. నాణేనికి ఒక వైపున మూడు సింహాలు, అశోక చక్రం ఉన్నాయి. మరోవైపు “నందమూరి తారక రామారావు శత జయంతి” అనే వచనంతో పాటు ఎన్టీఆర్ చిత్రం కూడా ఉంది. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ నాణెం 1923–2023 సంవత్సరాలుగా గుర్తించబడుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి