Indian Railways: ప్రయాణికులకు శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. ఆ ప్రత్యేక రైళ్లు పొడిగింపు
ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను మరింతగా పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే దేశంలోని వివిధ ప్రధాన రూట్లలో ఈ రైళ్లను పొడిగించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకునే ఈ రైళ్ల పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు..
ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను మరింతగా పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
- తిరుమతి-షిర్డీ సాయినగర్ (ట్రైన్ నం: 07637) ట్రైన్‌ను వచ్చే సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడపనున్నట్లు తెలిపింది.
- షిర్డీ సాయినగర్- తిరుపతి (ట్రైన్ నం:07638) రైలును సెప్టెంబర్ 4 నుంచి 25వ తేదీ వరకు ప్రతి సోమవారం పడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
- కాజీపేట – దాదర్ ( ట్రైన్ నం:07195) రైలు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 27తేదీ వరకు ప్రతి గురువారం
- దాదర్- కాజీపేట (ట్రైన్ నం:07195) రైలు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
- కాజీపేట- దాదర్ (ట్రైన్ నం:07197) వారాంతపు రైలు సెప్టెంబర్ 2-30 వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉండనుంది.
- దాదర్- కాజీపేట (ట్రైన్ నం: 07198) సెప్టెంబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉండనుంది.
- హైదరాబాద్- రక్సౌల్ (ట్రైన్ నం:07051) సెప్టెంబర్ 2 నుంచి 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రతి శనివారం ఈ రైలు నడువనుంది.
- రక్సౌల్- హైదరాబాద్ రైలు సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 3వరకు పొడిగిస్తూ ప్రతి మంగళవారం నడవనుంది.
- సికింద్రాబాద్- దానాపూర్ (ట్రైన్ నం:07419) సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2 వరకు పొడిగించగా, ప్రతి శనివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
- దానాపూర్- సికింద్రాబాద్ (ట్రైన్ నం:07420) సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2 వరకు పొడిస్తూ ప్రతి సోమవారం నడవనుంది.
- సికింద్రాబాద్- రక్సౌల్ (ట్రైన్ నం:07007) సెప్టెంబర్ 6 నుంచి 27 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.
- రక్సౌల్- సికింద్రాబాద్ మధ్య సెప్టెంబర్ 8 నుంచి 29వ తేదీ వరకు పొడగిస్తూ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉండనుంది.
- సికింద్రాబాద్- జైపూర్ (ట్రైన్ నం: 07115) సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం.
- జైపూర్- హైదరాబాద్ (ట్రైన్ నం:07116) సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉండనుంది.
- కాచిగూడ- బికనీర్ (ట్రైన్ నం:07053) సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి శనివారం.
- బికనీర్-కాచిగూడ (ట్రైన్ నం:07054) సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 3 వరకు పొడిగిస్తూ ప్రతి మంగళవారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Extension of special trains between various destinations @drmsecunderabad @drmned @drmvijayawada @drmgtl pic.twitter.com/tUN57zzozX
— South Central Railway (@SCRailwayIndia) August 25, 2023
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి