తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెయిన్ అలెర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు..!
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం వరకు విస్తరించిన రుతుపవనాలతో ఆంధ్రా అంతటా చెదురుమదురు వర్షాలు పడతాయని ప్రకటించింది. రాబోయే మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపికబురు అందించింది వాతావరణ శాఖ. ఎండ, ఉక్కపోతతో సతమతమవుతున్న ఏపీ, తెలంగాణలను మళ్లీ వరుణుడు పలకరించనున్నాడు. రానున్న ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం వరకు విస్తరించిన రుతుపవనాలతో ఆంధ్రా అంతటా చెదురుమదురు వర్షాలు పడతాయని ప్రకటించింది. రాబోయే మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ వాన కబురుతో చల్లబడనున్నారు ప్రజలు. గత నెలలో పడ్డ వానలు మళ్లీ ఇప్పటివరకు పడలేదు. దీంతో మళ్లీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.
Scattered rains getting triggered across Mancherial, Bhupalapally, Mulugu, Mahabubabad, Bhadradri – Kothagudem districts
Isolated – scattered rains slso expected in Hyderabad and adjoining districts too in next 2hrs
— Telangana Weatherman (@balaji25_t) August 26, 2023
మరోవైపు తెలంగాణలో రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణీ కారణంగా ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడమే కాదు.. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా వర్షాలు కురిసే అవకాశముందన్నారు వాతావరణ శాఖ అధికారులు.
#26AUG 2:05PM⚠️
SCATTERED -HEAVY Spells Ahead for North &West #Hyderabad during the next 1Hr⛈️#HyderabadRains pic.twitter.com/vFSXOYzMMB
— Hyderabad Rains (@Hyderabadrains) August 26, 2023
అటు ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే మరికొన్ని ప్రదేశాల్లో చిరుజల్లులు నుంచి మోస్తరు వర్షాలు కూడా పడతాయంది. కాగా, ఇప్పటికే ఏపీలోని పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం..