AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తండ్రి విగ్రహం ఎదుట కొడుకు పుట్టిన రోజు వేడుకలు.. ఊరందరి ఆశీస్సులతో..

Andhra Pradesh: గత యేడాది హఠాన్మరణం పొందిన వర్రే వెంకటేశ్వరరావు కు ఇద్దరు కుమారులు, ఇద్దరు తమ్ముళ్లు. అయితే, ఊరి ప్రజలందరి మంచి చెడుల్లో చేదోడు వాదోడు గా ఉండే వేంకటేశ్వరరావు హఠాన్మరణం అందరికి తీరని లోటుగా మిగిలింది. తన తండ్రి తమతో భౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు స్మృతులు ఆయన ఆశీసులు నిత్యం మాతోనే ఉండాలని తండ్రికి ఏకంగా నిలువెత్తు విగ్రహంతో గుడి కట్టించుకున్నారు.

Andhra Pradesh: తండ్రి విగ్రహం ఎదుట కొడుకు పుట్టిన రోజు వేడుకలు.. ఊరందరి ఆశీస్సులతో..
Man Celebrates His Birthday
Pvv Satyanarayana
| Edited By: Jyothi Gadda|

Updated on: Aug 26, 2023 | 4:07 PM

Share

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆగస్టు26: కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే.. వారి జ్ఞాపకాలతో గడిపేస్తుంటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం పెళ్లి పేరంటాలు ఏది జరిగినా.. వారు లేని లోటు స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే, ఇటీవల కుటుంబంలో చనిపోయిన వారి లోటు కనిపించకుండా చేస్తూ వారి రూపంతో విగ్రహలు, మైనపు బొమ్మలు తయారు చేయించుకుంటున్నారు చాలా మంది. అలా తయారు చేయించుకున్న తల్లిదండ్రులు, తోబుట్టువుల విగ్రహలను ఎదురుగా పెట్టుకుని తమ జీవితంలోని ముఖ్యమైన కార్యాలను నిర్వహించుకుంటున్నారు. ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచూగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.. ఇక తాజాగా అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మరో వార్త వెలుగులోకి వచ్చింది. మరణించిన తండ్రి విగ్రహం ఎదుట, ఊరందరి ఆశీర్వాదంతో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు ఓ యువకుడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పుట్టినరోజు నాడు స్నేహితులతో మందు పార్టీలు చేసుకునే ఈ రోజుల్లో చనిపోయిన తండ్రి విగ్రహం వద్ద బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు ఓ యువకుడు.  నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు … అందుకే ఉన్నాడు ఈ నాన్న ఈ పాట విమానం సినిమాలోనిది. తండ్రి కొడుకులు పై సాగిన ఈ గీతం ఎంతో మంది హృదయాలను హత్తుకుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటిదే ఓ తండ్రి కొడుకుల ప్రేమకథ. ఇది అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. నాన్న మీద ప్రేమతో,.. నాన్నా లేకపోయినా నాన్న విగ్రహాం వద్ద పుట్టినరోజు జరుపుకున్నాడు ఓ కుమారుడు… తన తండ్రి బతికున్నప్పుడు ఎంతో ఘనంగా ఊరందరికీ భోజనాలు పెట్టి మరి పుట్టినరోజు వేడుకలు చేసేవాడని తన తండ్రి లేకపోవడంతో తండ్రి విగ్రహం వద్ద తండ్రి ఉన్నట్టుగానే జరుపుకుంటున్నానంటూ.. ఆ కుమారుడు చెబుతున్నాడు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వర్రేపాలెం లో తండ్రికి గుడి కట్టి పూజిస్తున్నారు వారి కొడులు, ఊరి ప్రజలు. గత యేడాది హఠాన్మరణం పొందిన వర్రే వెంకటేశ్వరరావు కు ఇద్దరు కుమారులు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అయితే, ఊరి ప్రజలందరి మంచి చెడుల్లో చేదోడు వాదోడు గా ఉండే వేంకటేశ్వరరావు హఠాన్మరణం అందరికి తీరని లోటుగా మిగిలింది. తన తండ్రి తమతో భౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు స్మృతులు ఆయన ఆశీసులు నిత్యం మాతోనే ఉండాలని తండ్రికి ఏకంగా నిలువెత్తు విగ్రహంతో గుడి కట్టించుకున్నారు.

ఇవి కూడా చదవండి

చిన్నప్పటి నుంచి నా పుట్టునిరోజు అంగరంగ వైభవంగా ఒక వేడుకల చేసేవాడు మా నాన్నా అని అంటున్నాడు కుమారుడు చరణ్. అయితే, నాన్న చనిపోయిన తరువాత వచ్చిన మొదటి పుట్టినరోజును నాన్న నిలువెత్తు విగ్రహాం వద్ద మా ఊరి ప్రజలు స్నేహితుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు చరణ్. తండ్రి మీద ప్రేమ కొడుకుకి ఎనలేనిదని చెప్పడానికి ఇది ఒక్కటి సాక్ష్యం అంటున్నారు చుట్టుపక్కల ప్రజలు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..