AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nyos Disaster: ఆ సరస్సులో వెలువడి ప్రాణాంతక విష వాయువు.. ఊరి మొత్తాన్ని చంపేసింది..

తన కళ్ల ముందే తన పిల్లలు విగత జీవులుగా పడివుండటం చూసి హలీమా బోరున విలపించింది. ఎఫ్రాయిమ్ తన కుటుంబంలోని మరో 30 మంది సభ్యులను, 400 వరకు జంతువులను కోల్పోయాడు. చనిపోయిన జంతువులపై వాలిన ఈగ కూడా చనిపోవటం ఎఫ్రాయిమ్ గమనించాడు. అక్కడ ఎలాంటి కీటకాలు కూడా కనిపించలేదని చెప్పాడు.

Nyos Disaster: ఆ సరస్సులో వెలువడి ప్రాణాంతక విష వాయువు.. ఊరి మొత్తాన్ని చంపేసింది..
Nyos Lake Disaster
Jyothi Gadda
|

Updated on: Aug 26, 2023 | 10:44 PM

Share

ఒక్క దెబ్బతో ఆ గ్రామం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. మనుషులతో పాటు జంతువులు, చీలు, చివరకు తేనెటీగలు కూడా మృత్యువు బారిన పడ్డాయి. ఈ ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. పశ్చిమాఫ్రికాలోని న్యోస్ అనే గ్రామంలో జరిగిన సంఘటనలు ఆ గడ్డు కాలాన్ని గుర్తు చేశాయి. ఈ సంఘటన ఈనాటిది కాదు, అయితే ‘కార్బన్ డై ఆక్సైడ్’ వాయువు ఎంత ప్రమాదకరమో ప్రపంచానికి చాటిచెప్పాలి? ఎందుకంటే.. ‘కార్బన్ డై ఆక్సైడ్’ వాయువు ‘సైలెంట్ కిల్లర్’లా పనిచేసి ఊరందరినీ చంపేసింది. మనుషులు, జంతువులు, ఈగలు కూడా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాయి.. ఈ సంఘటనను నియోస్ డిజాస్టర్ లేక్ అంటారు. ఇందులో మొత్తం 1746 మంది మనుషులు, దాదాపు 3500 వరకు జంతువులు చనిపోయాయి. నివేదిక ప్రకారం ఆగస్ట్ 21, 1986న పశ్చిమ ఆఫ్రికాలోని న్యోస్ గ్రామంలోని ప్రజలు రాత్రి 9:00 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం విన్నారు. మరుసటి రోజు ఉదయం గ్రామానికి చెందిన ఎఫ్రాయిమ్ అనే వ్యక్తి ద్వారా తెలిసింది. ఆ గ్రామం మొత్తం చనిపోయిందని. గ్రామం మొత్తం భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ఇదంతా చూసిన ఎఫ్రాయిమ్‌కు కాళ్లు చేతులు పనిచేయలేదు. భయంతో వణికిపోయాడు.. అంతలో అతనికి ఒక స్త్రీ ఏడుపు వినిపించింది. దాంతో అతను ఆ మహిళ వద్దకు వెళ్లాడు. అక్కడికి చేరుకోగా ఆ మహిళ తనకు తెలిసిన హలీమా అని గుర్తుపట్టాడు.

మనోవేదనకు గురై హలీమా తన బట్టలు చింపేసుకుని మరీ రోధిస్తుందని ఎఫ్రాయిమ్ తెలిపాడు. చిరిగిన బట్టలతో ఆ మహిళ తన పిల్లల మృతదేహాల వద్ద కూర్చుని విలపిస్తోంది. తన కళ్ల ముందే తన పిల్లలు విగత జీవులుగా పడివుండటం చూసి హలీమా బోరున విలపించింది. ఎఫ్రాయిమ్ తన కుటుంబంలోని మరో 30 మంది సభ్యులను, 400 వరకు జంతువులను కోల్పోయాడు. చనిపోయిన జంతువులపై వాలిన ఈగ కూడా చనిపోవటం ఎఫ్రాయిమ్ గమనించాడు. అక్కడ ఎలాంటి కీటకాలు కూడా కనిపించలేదని చెప్పాడు.

ఈ హృదయ విదారక సంఘటన అంతా నియోస్ గ్రామంలోని సరస్సు కారణంగా జరిగింది. లేక్ నియోస్ విధ్వంసానికి ప్రధాన కారణం సరస్సు. లోతైన పొరలలో కరిగిన కార్బన్ డయాక్సైడ్ వాయువు చేరడం కారణంగా ప్రజలు ఊపిరాడక మరణించారు. సరస్సులో పేలుడు కారణంగా, నియోయ్ సరస్సు నుండి పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు రావడం ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

మన శరీరం ఆక్సిజన్‌ను తీసుకుంటుంది. కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. కానీ సరస్సు నుండి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ వాయువు మొత్తం గ్రామాన్ని చంపింది. సరస్సు నుంచి వెలువడిన గ్యాస్ సమీపంలోని వారందరినీ ఊపిరాడనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..