AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెంపుడు కుక్క మీద ప్రేమతో.. సినిమా తీసిన మాజీ మంత్రి.. ఇప్పుడు టామీ మృతితో..

టామీ సినిమా రాజా వన్నెం రెడ్డి దర్శకత్వం వహించిన 2015లో వచ్చిన తెలుగు భాషా డ్రామా చిత్రం. బాబు పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సీత ప్రధాన పాత్రలు పోషించగా చక్రి సంగీతం అందించారు. ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ హోమ్-వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్‌కి నంది అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రానికి రాజేంద్ర ప్రసాద్ 2014లో ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్‌గా నంది అవార్డును కూడా పొందారు.

B Ravi Kumar
| Edited By: |

Updated on: Aug 27, 2023 | 5:26 PM

Share

ఏలూరు,ఆగస్టు27: ఆయన మాజీ మంత్రి. రాజకీయాల్లో కురువృద్ధుడు. కాపు సంక్షేమ సేన పేరుతో వృద్ధాప్యం లోనూ ఉద్యమాలు చేస్తున్నారు. ఇది ఆయనలో ఒక యాంగిల్ అయితే మరో యాంగిల్ కూడా ఉంది. అది పెంపుడు కుక్క పై ఆయనకు ఉన్న ప్రేమ. ఇంతకీ ఆయనెవరో తెలుసా…? అదేనండి హరిరామజోగయ్య. ఈయన పెంపుడు కుక్క పేరు చాక్లెట్. దీంతో ఆయనకు 13 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉంది. భార్య చనిపోయిన తరువాత జోగయ్య ను కంటికి రెప్పలా చూసుకుంది. దాని మరణంతో జోగయ్య తీవ్ర వేదనకు గురయ్యారు. చాక్లెట్ ఆత్మశాంతి కోసం దశ దిశ కర్మను ఘనంగా నిర్వహించారు జోగయ్య.

కుక్క పై ప్రేమతో సినిమా..

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో నివాసము ఉంటున్న జోగయ్య కు కుక్కలు పై అమితమైన ప్రేమ ఎప్పుడూ ఇంట్లో ఓ కుక్కని పెంచుతూ ఉంటారు. ఆ ప్రేమ తోనే డబ్బుల గురించి లెక్క చేయకుండా కుక్క ప్రధాన పాత్ర తో రాజా వన్నెం రెడ్డి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ నటించిన టామీ అనే సినిమా ను తీసి రిలీజ్ చేశారు జోగయ్య.

ఇవి కూడా చదవండి

అందరూ ఎందుకు ఈయనకు కుక్క లపై సినిమాలు, ఉన్న డబ్బు పాడుచేసుకోవడానికి అని విమర్శించారు. అయినా ఆయన ఎవరిమాట పట్టించుకోకుండా కుక్క పై సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కుక్క చాలా విశ్వాస మైన జంతువుగా అని పూర్తిగా నమ్ముతారు. తన పెంపుడు కుక్క చాక్లెట్ తన పట్ల ఎంతో ప్రేమగా ఎక్కడుంటే అక్కడ ఉండేదని దాని స్మృతులను ఆయన నెమరు వేసుకున్నారు.

ఎవరైనా వస్తే తనను ఏమైనా చేస్తారేమో అని వారిని చాక్లెట్ కరి చేసేదంటారు జోగయ్య, అలా కలిసిన వారిలో పది మంది ఎమ్మెల్యేల వరకు ఉన్నారని తెలిపారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఓ కుక్కను పెంచుకోవాలనే సలహా సైతం ఇస్తారు.

టామీ సినిమా రాజా వన్నెం రెడ్డి దర్శకత్వం వహించిన 2015లో వచ్చిన తెలుగు భాషా డ్రామా చిత్రం. బాబు పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సీత ప్రధాన పాత్రలు పోషించగా చక్రి సంగీతం అందించారు. ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ హోమ్-వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్‌కి నంది అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రానికి రాజేంద్ర ప్రసాద్ 2014లో ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్‌గా నంది అవార్డును కూడా పొందారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌