Telangana: గంట వ్యవధిలో రెండు వరుస ప్రమాదాలు.. నలుగురు మృతి‌, ఆరుగురికి తీవ్రగాయాలు

టిప్పర్ లో ఉన్న డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకుని చనిపోగా క్లీనర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై గుంతలు పూడుస్తూ 12 మంది కార్మికులు పనులు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా కార్మికుల మీదకు లారీ దూసుకురావడంతో హాహా కారాలు చేస్తూ కార్మికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

Telangana: గంట వ్యవధిలో రెండు వరుస ప్రమాదాలు.. నలుగురు మృతి‌, ఆరుగురికి తీవ్రగాయాలు
Road Accident
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 27, 2023 | 5:55 PM

నిర్మల్ జిల్లా, ఆగస్టు27: నిర్మల్ జిల్లా రహదారులు‌ వరుస ప్రమాదాలతో రక్తసిక్తమైంది. లారీ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు ముగ్గురు వలస కూలీలను ఇద్దరు డ్రైవర్లను బలి తీసుకుంది. గంట వ్యవదిలో చోటు చేసుకున్న రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి వద్ద జాతీయ రహదారి 44 పై ఘోర రోడ్డు‌ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ జాతీయ రహదారిపై పనులు చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఆ పక్కనే ఉన్న టిప్పర్ ను ఢీకొట్టడంతో టిప్పర్ బోల్తా పడింది. ఈ ఘటనలో జాతీయ రహదారి 44 పై ప్యాచ్ వర్క్ చేస్తున్న ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

లారీ అతి వేగంతో ఢీకొట్టడంతో జాతీయ రహదారిపై మరమ్మత్తు పనుల కోసం నిలిపిన టిప్పర్ అంతే వేగంతో ముందుకు దూసుకెళ్లింది. టిప్పర్ లో ఉన్న డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకుని చనిపోగా క్లీనర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై గుంతలు పూడుస్తూ 12 మంది కార్మికులు పనులు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా కార్మికుల మీదకు లారీ దూసుకురావడంతో హాహా కారాలు చేస్తూ కార్మికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ఈ ఘటన జరిగిన‌ కొద్ది‌ సేపటికే నిర్మల్ జిల్లా రూరల్ మండలం చిట్యాల బ్రిడ్జి వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిర్మల్ లో గంట వ్యవదిలో వరుసగా రెండు ఘటనలు చోటు‌ చేసుకోవడంతో నలుగురు మృతి చెందగా.. క్షతగాత్రులను నిర్మల్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

అటు, జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని ఇటిక్యాల మండలంలో ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలిసింది. బీచుపల్లి వద్ద మృతులు ప్రయాణిస్తున్న టాటా ఏస్​ వాహనం పంక్చర్​ కావటంతో వెహికిల్‌ టైరు మార్చేందుకు ఇద్దరూ అందులో నుంచి దిగారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..