Incentive Scheme: షాపింగ్ బిల్ అప్‌లోడ్ చేస్తే రూ.కోటి..! కేంద్రం బంపర్ ఆఫర్.. వీడియో.
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎక్కడ షాపింగ్ చేసినా ఫరవాలేదు.. ఏ వస్తువు కొన్నా ఫరవాలేదు, కాకపోతే బిల్లు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ బిల్లును అప్‌లోడ్ చేస్తే చాలు.. లక్కీ డ్రాలో మీరు బహుమతి గెలుచుకోవచ్చు. అది ఒకరికో, ఇద్దరికో పరిమితం చేసే బహుమతి కాదు. వందల మంది ఈ బహుమతులు గెలుచుకోవచ్చు. పది మంది తలో 10 లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎక్కడ షాపింగ్ చేసినా ఫరవాలేదు.. ఏ వస్తువు కొన్నా ఫరవాలేదు, కాకపోతే బిల్లు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ బిల్లును అప్‌లోడ్ చేస్తే చాలు.. లక్కీ డ్రాలో మీరు బహుమతి గెలుచుకోవచ్చు. అది ఒకరికో, ఇద్దరికో పరిమితం చేసే బహుమతి కాదు. వందల మంది ఈ బహుమతులు గెలుచుకోవచ్చు. పది మంది తలో 10 లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు. మరో ఇద్దరు అదృష్టవంతులు చెరో కోటి రూపాయలు చేసుకోవచ్చని కేంద్ర సర్కార్ ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని రాష్ట్రాల్లో ఏడాది కాలం వర్తించేలా అమలు చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ పథకానికి ‘మేరా బిల్.. మేరా అధికార్’ అంటూ కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది.
వినియోగదారులు తాము కొనే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకునే సంస్కృతిని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర సర్కార్. తొలుత ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేసేందుకు సిద్ధమైంది కేంద్రం. అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్ఛేరి, దాద్రా నగర్ హవేలి, డమన్ డయ్యూలో సెప్టెంబర్ 1 నుంచి ఏడాది పాటు అమలు చేయనుంది. ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీఎస్టీ రిజిస్టర్డ్ సరఫరాదారులు, వ్యాపారులు ఇచ్చే బిల్లులు, వాటిని తీసుకునే కస్టమర్లు అర్హులు. అయితే బిల్లు కనీస 200 రూపాయలపైనే ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌లో అందుబాటులో ఉంచిన “మేరా బిల్.. మేరా అధికార్” యాప్‌లో లేదంటే web.merabill.gst.gov.in సైట్‌లో వినియోగదారులు తమ బిల్లులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

