రెనాల్డ్స్ పెన్నుల తయారీ నిలిపివేత ??
రెనాల్డ్స్ 045.. ఈ పెన్ను గురించి తెలియని వారు ఉండరంటే అతి శయోక్తి కాదు. ఎందరో విద్యార్థులు తొలిసారిగా వినియోగించిన పెన్ను ఇదే. స్కూలు రోజులు గుర్తొచ్చిన ప్రతిసారీ కళ్లముందు కచ్చితంగా మెదిలేది రెనాల్డ్స్ పెన్నే. అయితే ఓ తరం విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఈ పెన్ను ఇకపై మార్కెట్లో కనబడదంటూ ఓ వార్త ఇటీవల నెట్టింట్లో వైరల్ అవుతూ కలకలం రేపింది. దాంతో రెనాల్డ్స్ పెన్నుతో తనకున్న అనుబంధం మరువలేనిదని, ఓ బాక్సు పెన్నులు కొనుగోలు చేసి గుర్తుగా దాచుకుంటానని ఓ యూజర్ కామెంట్ చేశారు.
రెనాల్డ్స్ 045.. ఈ పెన్ను గురించి తెలియని వారు ఉండరంటే అతి శయోక్తి కాదు. ఎందరో విద్యార్థులు తొలిసారిగా వినియోగించిన పెన్ను ఇదే. స్కూలు రోజులు గుర్తొచ్చిన ప్రతిసారీ కళ్లముందు కచ్చితంగా మెదిలేది రెనాల్డ్స్ పెన్నే. అయితే ఓ తరం విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఈ పెన్ను ఇకపై మార్కెట్లో కనబడదంటూ ఓ వార్త ఇటీవల నెట్టింట్లో వైరల్ అవుతూ కలకలం రేపింది. దాంతో రెనాల్డ్స్ పెన్నుతో తనకున్న అనుబంధం మరువలేనిదని, ఓ బాక్సు పెన్నులు కొనుగోలు చేసి గుర్తుగా దాచుకుంటానని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పరీక్షలు ఈ పెన్ను తోనే రాశానని, అలాంటిది వాటి తయారీని ఆపేస్తామని చెప్పడం చాలా బాధగా ఉందంటూ అని మరో యూజర్ రాసుకొచ్చాడు. ఈ పెన్నుతో ప్రత్యేక అనుబంధం ఉన్న వారందరూ ఇలా సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేయడంతో రెనాల్డ్స్ సంస్థ స్వయంగా స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని ప్రకటించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక చేతిలో స్టీరింగ్, మరో చేతిలో గొడుగు.. జోరువానలో డొక్కు బస్సుతో డ్రైవర్ అతి
అది ప్యాలెస్ కాదు.. మరేంటో తెలిస్తే షాకే !!
మసాజ్ మిషన్‌లో ఎరక్కపోయి ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!
కూతురికోసం అమ్మలా మారిన తండ్రి !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో