కూతురికోసం అమ్మలా మారిన తండ్రి !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్‌ వీడియో

తండ్రీ కూతుళ్ల అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. నాన్నకి కూతురంటే పంచ ప్రాణాలు. కూతురికి నాన్న సూపర్ హీరో. అలాంటి ఓ అందమైన తండ్రికూతురి వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఈ వీడియోలో ఓ యువతి అద్దం ముందు నిలబడి మేకప్‌ వేసుకుంటోంది. చూస్తుంటే ఆమె ఎయిర్‌హోస్టెస్‌లా కనిపిస్తోంది. ఇంతలో ఆమె తండ్రి ప్లేట్‌లో అన్నం పెట్టుకొని తీసుకొచ్చాడు. టైం అయిపోయిందని కూతురు ఎక్కడ తినకుండా వెళ్ళిపోతుందోనని ఆ తండ్రి గోరుముద్దలు తినిపిస్తున్నాడు.

కూతురికోసం అమ్మలా మారిన తండ్రి !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్‌ వీడియో

|

Updated on: Aug 28, 2023 | 9:05 PM

తండ్రీ కూతుళ్ల అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. నాన్నకి కూతురంటే పంచ ప్రాణాలు. కూతురికి నాన్న సూపర్ హీరో. అలాంటి ఓ అందమైన తండ్రికూతురి వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఈ వీడియోలో ఓ యువతి అద్దం ముందు నిలబడి మేకప్‌ వేసుకుంటోంది. చూస్తుంటే ఆమె ఎయిర్‌హోస్టెస్‌లా కనిపిస్తోంది. ఇంతలో ఆమె తండ్రి ప్లేట్‌లో అన్నం పెట్టుకొని తీసుకొచ్చాడు. టైం అయిపోయిందని కూతురు ఎక్కడ తినకుండా వెళ్ళిపోతుందోనని ఆ తండ్రి గోరుముద్దలు తినిపిస్తున్నాడు. అద్భుతమైన ఈ సన్నివేశాన్ని ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పూజా బిహానీ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. డ్యూటీకి వెళ్లడానికి ముందు ఆమె అద్దం ముందు నిలబడి మేకప్ చేసుకుంటుంటే ఆమె తండ్రి అన్నం తినిపిస్తున్నాడు. ఈ వీడియో అందరి మనసుల్ని కట్టిపడేసింది.’నాన్నా..నువ్వే నా బెస్ట్. నాకు నువ్వు చేసే ప్రతి చర్యకూ కృతజ్ఞతలునాన్నా.. నువ్వు ఎక్కడుంటే అదే నా ఇల్లు.. ఐ లవ్ యూ పాపా అంటూ వీడియో షేర్‌ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీడియోపై రకరకాలుగా స్పందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దాహంతో అల్లాడిన శునకం.. ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే !!

బాహుబలి మిక్సర్ గ్రైండర్.. ఇదే దీని స్పెషల్‌

భయ్యా ఇదేం పని ?? మెట్రో లేడీస్ కోచ్‌లోకి యువకుడు

ఈ స్మార్ట్ రింగ్ ఆడవాళ్లకు ప్రత్యేకం !! ఆగస్ట్ 28 నుంచి కొనుగోళ్లకు అవకాశం

ఆమె ముఖాన్ని సగానికి కట్‌ చేసి, 90 డిగ్రీల్లో తిప్పి

 

Follow us